భ‌య‌పెడుతున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ మౌనం!

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు మనసులో ఎవరికీ అంతు చిక్క‌డం లేదు. జైలుకు వెళ్లాలని ఆయన ఎందుకు అనుకున్నారో కూడా అర్థం కావడం లేదు

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు మనసులో ఎవరికీ అంతు చిక్క‌డం లేదు. జైలుకు వెళ్లాలని ఆయన ఎందుకు అనుకున్నారో కూడా అర్థం కావడం లేదని పోలీస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జ‌రుగుతోంది. ముంబై సినీ నటి కాదంబరి జెత్వానీ ఫిర్యాదు మేరకు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసు నమోదైన సంగ‌తి తెలిసిందే. పీఎస్ఆర్ ఆంజ‌నేయులు మిన‌హా మిగిలిన ఇద్ద‌రు ఐపీఎస్ అధికారులు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు.

ఒకవేళ పీఎస్ఆర్ న్యాయస్థానాన్ని ఆశ్ర‌యించి వుంటే, బెయిల్ పొందేవారు. కానీ ఆయ‌న ఆ ప‌ని చేయ‌లేదు. మొండిగా వ్య‌వ‌హ‌రించారు. జెత్వానీ కేసులో అరెస్ట్ అయిన త‌ర్వాత కూడా ఆయ‌న చాలా రిలాక్ష్‌గా ఉన్నారు. జైలుకు వెళ్లి రావాల‌ని అనుకున్న‌ట్టు త‌న‌ను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల‌తో అన్న‌ట్టుగా వార్త‌లొచ్చాయి. సంప్ర‌దాయ కుటుంబం నుంచి వ‌చ్చిన ఆయ‌న జైలుకు వెళ్లే స‌మ‌యంలో పూజాసామ‌గ్రిని తీసుకెళ్ల‌డం విశేషం.

జైలుకు వెళ్లాల‌న్న ఆయ‌న కోరిక తీరింది. నిజానికి ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డానికి ప్ర‌భుత్వం ఆలోచించి వుండాల్సింది. అరెస్ట్ చేయ‌డం ద్వారా టీడీపీ అనుకూల ఐపీఎస్ అధికారుల్లో భ‌యం ఏర్ప‌డింది. ప్ర‌భుత్వాలు శాశ్వ‌తం కాద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. ఇదే సంప్ర‌దాయాన్ని రానున్న రోజుల్లో వ‌చ్చే పాల‌కులు అనుస‌రిస్తే, ఇక ఉన్న‌త హోదాల్లో ఉన్నోళ్లు ఉద్యోగాలు చేయ‌డం ఎలా? అనే చ‌ర్చ ఆయా వ‌ర్గాల్లో విస్తృతంగా సాగుతోంది.

ప్ర‌స్తుతం విజ‌య‌వాడ జిల్లా జైల్లో పీఎస్ఆర్ ఆంజ‌నేయులున్నారు. బెయిల్ కోసం ఆయ‌న న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌డం గ‌మ‌నార్హం. అరెస్ట్ సంద‌ర్భంలో త‌న కేసును తానే వాదించుకున్న ఆంజ‌నేయులు, ఇప్పుడు మాత్రం లాయ‌ర్‌ను నియ‌మించుకున్నారు. ఈ నెల 29న బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. అన్నింటికంటే మౌనం ఎక్కువ భ‌య‌పెడుతుంద‌ని అంటారు. పీఎస్ఆర్ ఆంజ‌నేయులు మౌనం, ధిక్కారం కొంత మందిని భ‌య‌పెడుతోంద‌న్న ప్ర‌చారాన్ని కొట్టి పారేయ‌లేం

25 Replies to “భ‌య‌పెడుతున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ మౌనం!”

      1. అందుకే ఒక దళిత యువకుడి మీద సాక్ష్యం కూడా ఇవ్వకుండా  అన్యాయంగా 5ఏళ్ళు జైలు లో ఉంచాడు

      2. మీరు అడగాల్సింది …. ఇయంది ధైర్యం అయితే హై కోర్టు , సుప్రీం కోర్టు, క్యాట్ దాకా పలు మార్లు వెళ్లి చివరికి పదవి లో రిటైర్ అయిన ABV సంగతి ఏంది

  1. కరెక్ట్….ఆ మౌనం ఎప్పుడూ బ్లాస్ట్ అయ్యి నిజాలు కక్కుతుందో అన్న భయం కొందరిలో కింద వణుకు తెప్పిస్తుంది 

  2. పూజ చెసె, పాపం కాదంబరిని హింసించటానికి పదక రచన చెసారు అనుకుంటా అంటావా?

    జైలుకి పూజ సామగ్రి తీసుకెల్లినంత మాత్రాన పత్తిత్తులు అయిపొరు, అది పత్తిత్తులా కనపడాలి అని చెసె ప్రయత్నమె!

    .

    రాజశెకర్ రెడ్డి పాలనలొ కూడా పరిది దాటి ప్రవర్తించి, అవినీతి లొ బాగస్వములు అయ్యి, చాలా మంది IAS/IPS లు జైలు పాలు అయ్యారు. అయినా కొందరికి బుద్ది రాలెదు!!

    1. సార్, రెడ్ బుక్ అని లోకేష్ గారు ప్రచారం చేశాకే, ప్రజలు టీడీపీ కు ఓటు వేశారు. అంటే రెడ్ బుక్ ఇక ఒక్క టీడీపీ సొంతం కాదు, అది ఇపుడు ప్రజల సొంతం, ప్రజా తీర్పు. రెడ్ బుక్ లో ఏమి ఉన్నా లేక పోయినా, టీడీపీ వైసీపీ మీద అస్త్ర ప్రయోగాలు చేయక పోతే ప్రజలు టీడీపీ మీద తిరగ పడతారు. రెడ్ బుక్ అని వైసీపీ ప్రచారం చేసే హక్కు కోల్పోయింది. ఇది అన్ అఫీషియల్ గా మీకు రాస్తున్న నా అభిప్రాయం. “రెడ్ బుక్ ఈస్ నౌ ప్యూపిల్స్ వాయిస్” అని ప్రచారం జరగాలి. బెస్ట్ విషెస్ టు యు, టీడీపీ అండ్ ఆంధ్ర ప్రజలు.

  3. అప్పట్లొ విజయవాడలొ ఒక లెడీ డాక్టర్ కి కామంతొ పిచ్చి పిచ్చి మెస్సెజులు పెట్టి దొరికి పొయారు!

    విషయం గబ్బు లెగిసాక.. అబ్బె నెను పత్తితుని.. వల్లభనెని వంశి నె ఆ లెడీ డాక్టర్ చెత నా పరువు తీయిస్తున్నాడు అని వింత వాదన చెసారు! మహిళా సంఘాల గొడవతొ అయన్ని అక్కడ నుండి ట్రాస్ఫర్ చెసారు! ఈ విషయం ఆన్ లైన్ పెపర్లల్లొ ఇంకా ఉంది!

    .

    పాపం పూజలొ … ఎంతటి మహానుబావులొ?

  4. “భ‌య‌పెడుతున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ మౌనం!”..

    shameless article as if we should admire him…siggu vadilesava?

  5. He may be thinking if he goes to jail he will get plum post if jagan govt comes back. But reality is if andhra people are ever vote jagan again they are fools.

  6. తెలివైనవాడు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు లేకపోతే చీటీ చింపి వేసి ఎదుటి వారి మీదికి తోసేయడం అలవాటే కదా..

  7. I think his mounam is scaring jagan.

    why are you trying to give a build up to Anjaneyulu.

    he is a criminal who misused his power to harass and threaten an innocent girl and her family.

    great Andhra should stop this soft corner for criminal elements.

  8. GA , the last two paragraphs clearly says what you want to say though that’s not the realty. Governments do change and that’s norm . But what prev govt did was criminal acts against others . That’s punishable . Period. So don’t expect every govt does such revenge acts

  9. ప్యాలెస్ పులకేశి  విసిరేసిన బిచ్చం కోసం , అతని కి బానిసలు గా పనిచేసి , ఆ పదవి పరువు తీసుకున్న  

    తుచ్ఛమైన ఐఎస్ఐ, ఐపీఎస్ లు అను నెటిజన్ల అభిప్రాయం.

    శ్రీలక్ష్మి 

    అజయ్ రెడ్డి

    కసిరెడ్డి

    ధనుంజయ రెడ్డి

    ఆంజనేయులు

    సునీల్

    విశాల్ గున్ని

    కాంతి టాటా

    ప్యాలెస్ పులకేశి కి నిజాలు చెప్పటానికి ట్రై చేసి పదవి పోగొట్టుకున్న ias, ips లు

    Lv సుబ్రమణ్యం గారు.

Comments are closed.