నడి రోడ్డుపై కూటమి ఎమ్మెల్యేల కొట్లాట!

నీ ధోర‌ణి బాగాలేద‌ని, చేసింది త‌ప్పంటూ విష్ణుకుమార్ రాజును నేరుగానే గంటా శ్రీ‌నివాస‌రావు తప్పు పట్టడండం గమనార్హం

బీజేపీ సీనియర్ నేత‌, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజుపై టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. నీ ధోర‌ణి బాగాలేద‌ని, చేసింది త‌ప్పంటూ విష్ణుకుమార్ రాజును నేరుగానే గంటా శ్రీ‌నివాస‌రావు తప్పు పట్టడం గమనార్హం. ఇద్దరూ కూటమి నేతలే కావడంతో విభేదాల గురించి పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నారు. వీళ్లిద్దరి మధ్య భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఫిలిం న‌గ‌ర్ క్లబ్ లీజు వ్యవహారం గొడ‌వ పెట్టింది.

ఫిలింన‌గ‌ర్ లీజు వ్య‌వ‌హారం పై క‌లెక్ట‌ర్‌కు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు చేయ‌డం గంటాకు ఏ మాత్రం న‌చ్చ‌లేదు. ఈ నేప‌థ్యంలో విష్ణుకుమార్ రాజు ఒక చోట గంటా శ్రీ‌నివాస‌రావుకు ఎదురు ప‌డ్డారు. కారులో గంటా కూచొని వుండ‌గా, ఆయ‌న వ‌ద్ద‌కు విష్ణుకుమార్ రాజు వెళ్లారు. విష్ణుకుమార్ రాజును చూడ‌గానే గంటా తీవ్ర ఆగ్ర‌హానికి లోన‌య్యారు. మొద‌ట మీరు చేసింది త‌ప్పు అని మొహం మీదే ఆయ‌న చెప్పారు. ఎంపీ గారికి కూడా చెప్పాన‌ని విష్ణుకుమార్ రాజు స‌ర్ది చెప్పుకోడానికి ప్ర‌య‌త్నించారు.

అయిన‌ప్ప‌టికీ గంటా శ్రీ‌నివాస‌రావు వినిపించుకోలేదు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎలా జోక్యం చేసుకుంటావ‌ని విష్ణుకుమార్ రాజును గంటా ప్ర‌శ్నించారు. ఇష్ట‌మొచ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తే స‌హించేది లేద‌ని బీజేపీ ఎమ్మెల్యేకు గంటా హెచ్చ‌రిక చేయ‌డం గ‌మ‌నార్హం. ఫిలింన‌గ‌ర్ క్ల‌బ్ అనేది త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని విష్ణుకుమార్ రాజుకు గంటా గుర్తు చేస్తూ, క‌లెక్ట‌ర్‌కు దాని లీజు వ్య‌వ‌హారంపై విశాఖ నార్త్ ఎమ్మెల్యే అయిన మీరు ఎలా ఫిర్యాదు చేస్తార‌ని నిల‌దీశారు.

అయితే క‌లెక్ట‌ర్ ద‌గ్గ‌రికి తాను వెళ్లే స‌మ‌యంలో అందుబాటులో మీరు లేర‌ని గంటాకు వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ విష్ణుకుమార్ స‌మాధానంతో గంటా సంతృప్తి చెంద‌లేదు. త‌న‌కు తెలియ‌కుండా భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో జోక్యం చేసుకుంటే బాగుండ‌ద‌ని హెచ్చ‌రిస్తూ… గంటా ముందుకు క‌దిలారు. ప్ర‌స్తుతం వీళ్లిద్ద‌రి మ‌ధ్య వాద‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

14 Replies to “నడి రోడ్డుపై కూటమి ఎమ్మెల్యేల కొట్లాట!”

  1. ఎక్కడ జరుగుతుంది చర్చ…మన బ్లూ మీడియా లోనా….వాళ్లకు అంతకు మించి పెద్దగా పని లేదుగా

    1. కొమ్మినేని శ్రీనివాసరావు, కేఎస్ ప్రసాద్, జర్నలిస్టు వైఎన్ఆర్ లాంటి మేధావులు చర్చ చేస్తారని జీఏ గారి ఉద్దేశం 

    1. లిక్కర్. లో పంచుకున్న వాళ్ళు అంత ఒక్కటయ్యారు జైలు లో 

    1. Haha లిక్కర్ సొమ్ములు అంతా నెలకు 60 కోట్లు.  విజయ సాయి గారి వాటాలు వారికి ఇవ్వండి 

  2. ఆఖరికి ఇలాంటివి చూసి మురిసిపోయే స్థాయి కి ఒచ్చేసావా రా వెంకీ ! 151 నుంచి మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదో చిన్న గొడవ పడితే ఆనంద పడే స్టేజి కి వచ్చారు .

    గుడి సెట్లు వేసుకున్న గుడేసేటి ఏదవలకన్నా బెటర్ ఏ కదా…!

Comments are closed.