రెక్కలు విప్పుకోనున్న విమానాలు…. బ్రాండ్ ఇమేజ్ గా…

విమానాలు ఇపుడు ప్రగతికి సోపానాలుగా చూడాలి.  వేగం జీవితంలో పెరిగాక ఆ వేగం అభివృద్ధికి బాటలు వేస్తున్నాక ప్రయాణ సాధనాలు కూడా మారుతున్నాయి. ఇపుడు విమాన ప్రయాణాలు ఎక్కువ అయ్యాయి. దాంతో మెగా సిటీస్…

విమానాలు ఇపుడు ప్రగతికి సోపానాలుగా చూడాలి.  వేగం జీవితంలో పెరిగాక ఆ వేగం అభివృద్ధికి బాటలు వేస్తున్నాక ప్రయాణ సాధనాలు కూడా మారుతున్నాయి. ఇపుడు విమాన ప్రయాణాలు ఎక్కువ అయ్యాయి. దాంతో మెగా సిటీస్ కి ఇవే బ్రాండ్ ఇమేజ్ గా మారుతున్నాయి.

ఆ విధంగా చూస్తే విశాఖ నుంచి మరిన్ని విమానాలు రెక్కలు విప్పుకోబోతున్నాయి. ఇప్పటికే  ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్న విశాఖకు రానున్న కాలంలో కొత్త  విమాన సర్వీసులు పెరగనున్నాయి. ఈ రోజుకు చూస్తే విశాఖ ఎయిర్‌ పోర్టు నుంచి ఏటా 18 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.

త్వరలోనే గోవా, భువనేశ్వర్‌లకు విశాఖ నుంచి విమానాలు ప్రారంభం కానున్నాయి. విశాఖ నుంచి  దేశంలోని మరిన్ని ప్రధాన నగరాలకు విమానాలను నడిపే చర్యలు తీసుకుంటున్నట్లుగా విమాన యాన అధికారులు వెల్లడిస్తున్నారు.  

మొత్తానికి చూస్తే విశాఖ అంతర్జాతీయ విమాన సేవలతో పాటు దేశీయ సేవలు కూడా బాగా ఇటీవ‌ల కాలంలో పెరిగాయి. మరి స్మార్ట్ సిటీ గ్రోత్ కి ఇది నిదర్శనంగా అధికారులు  భావిస్తున్నారు.