1). “గాంధీ”ల కుటుంబం నుంచి పార్టీ బయటపడకపోవడం (ఇప్పుడు కూడా రాహుల్, ప్రియాంకగాంధీల వైపు చూస్తున్నారు తప్ప స్వయం వ్యక్తిత్వంతో పార్టీని నడిపే నాయకులు లేరు. ఒకవేళ వున్నా సోనియా అనుకూల ముఠా చేతిలో మిగలరు)
2). ఢిల్లీ చుట్టూ తిరిగిన వాళ్లకి పదవులు ఇవ్వడం (భవనం వెంకట్రాం, కిరణ్‌కుమార్‌రెడ్డి గట్టి ఉదాహరణలు)
3). ప్రజల్లో గుర్తింపు వున్న వాళ్లని పార్టీ నుంచి తరిమి వేయడం (మమతాబెనర్జీ, జగన్)
4). స్థానిక సెంటిమెంట్‌ని గుర్తించకుండా, బలవంతపు విధానాలు రుద్దడం (హిందీ ఉద్యమం తరువాత తమిళనాడులో కాంగ్రెస్ మళ్లీ బతకలేదు)
5). ప్రాంతీయ పార్టీల బలాన్ని గుర్తించకుండా, మొదటి నుంచి చిన్న చూపు చూడడం
6). పార్టీ కోసం ముందు నుంచి పనిచేసిన వాళ్లకి కాకుండా, వలస వచ్చిన వాళ్లకి పదవులిచ్చి గౌరవించడం
7). ముఖ్యమంత్రుల్ని పెద పాలేర్లుగా చూడడం (అంజయ్యని రాజీవ్‌గాంధీ అవమానించడం కూడా 1983లో తెలుగుదేశం విజయానికి ఒక కారణం)
8). రాహుల్ గాంధీ నాన్ సీరియస్ పొలిటీషియన్‌గా ముద్రపడడం
9). వృద్ధ నాయకులే చక్రం తిప్పడం. కొత్తగా వచ్చే యువకులు వారసులైతే తప్ప ఎదగలేని స్థితి వుండడం
10). పదేపదే ఓడిపోతున్న వాళ్లకి మళ్లీమళ్లీ టికెట్లు ఇవ్వడం
జీఆర్ మహర్షి