బ్రేక్ తీసుకున్న అమరావతి జేఏసీ!

అమరావతి యాత్ర తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు అమరావతి జేఏసీ నేతలు. హై కోర్ట్ ఆదేశాలను పాటించమని పోలీసులు వారికీ చెప్పడంతో వాగ్వాదానికి దిగి, పోలీస్ ఆంక్షలు నేపథ్యంలో నాలుగు రోజులు పాటు యాత్రను వాయిదా…

అమరావతి యాత్ర తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు అమరావతి జేఏసీ నేతలు. హై కోర్ట్ ఆదేశాలను పాటించమని పోలీసులు వారికీ చెప్పడంతో వాగ్వాదానికి దిగి, పోలీస్ ఆంక్షలు నేపథ్యంలో నాలుగు రోజులు పాటు యాత్రను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

అమరావతి ఏకైక రాజధాని ఉండాలని అమరావతి జేఏసీ చేస్తున్న అమరావతి టూ అరసవెళ్లి యాత్ర ఇవాళ 41వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఉదయం అమరావతి జేఏసీ నేతలు బస చేస్తున్న ఫంక్షన్‌ హాల్‌ దగ్గరకు పోలీసులు వెళ్లి యాత్రలో 600 మందికి మించకూడదని చెప్పడంతో పోలీసులతో వాగ్వాదం చేసి యాత్రపై కోర్టులో తేల్చుకుందాం అంటూ యాత్రను నాలుగు రోజులు విరామం ప్రకటించారు. 

ఈ రోజు వీకెండ్ తో పాటు వచ్చే మూడు రోజులు కూడా పండగ సెలవులు నేపథ్యంలో పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. హై కోర్ట్ పర్మిషన్ తీసుకొని చేస్తున్న యాత్రలో అమరావతి రైతుల ముసుగులో అధికార పార్టీ నేతలను బూతులు తిడుతూ, తొడలు కొడుతూ సాగుతున్న యాత్రకు హై కోర్ట్ కొత్తగా కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. 

రాజకీయ పార్టీ నేతలు యాత్రలో పాల్గొనకూడదని కేవలం వారికీ సంకీభావం మాత్రమే తెలపాలని యాత్రలో 600మందికి మించకూడదని, కేవలం కొన్ని వాహనాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జేఏసీకి ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే యాత్రలో దాదాపు 50కి పైగా వాహనాలు ఉంటున్నాయి. దారి పొడవునా టీడీపీ నేతలు చేస్తున్న హడావుడి కూడా ఈ పరిస్థితులకు కారణం.