మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం ఎందుకని, నేను వెళ్లి ప్రచారం చేసినా ఓ పదివేలు ఓట్లు మాత్రమే వస్తాయన్నారు. మునుగోడులో తన తమ్ముడు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుస్తారని జోస్యం చెప్పారు.
పాదయాత్ర చేద్దామనుకున్నా కాంగ్రెస్ లోని గ్రూపుల కొట్లాటలతో చేయలేకపోతున్నా అంటూ వాపోయారు. మునుగోడులో రెండు అధికార పార్టీలు కొట్లాడుతున్నప్పుడు మనమేం చేయగలం అంటూ గత 25 ఏళ్లుగా కాంగ్రెస్ ఉన్నానని ఇంకా చాలన్నారు. అవసరమైతే రాజకీయాలను తప్పుకుంటానంటూ సంచాలన వ్యాఖ్యలు చేశారు.
మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజా వ్యాఖ్యలతో తాను కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నట్లు అర్థమవుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా కానున్నాయి. వచ్చే సంవత్సరం జరగబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎన్నికలు సెమీఫైనల్ లాగా ఉండబోతున్నాయి. ఈ గెలుపు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పునాది లాగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి.