వైఎస్సార్ భక్తుడిని.. అంతే !

వైసీపీలో రాజ్యసభ సభ్యులు జంప్ చేస్తారు అని ప్రచారం సాగుతున్న దగ్గర నుంచి ఒక పేరు విషయం మాత్రం బాగా నలుగుతోంది. ఆయన గురించే అంతా ఊహిస్తూ వైరల్ చేస్తున్నారు. ఆయన జంప్ చేస్తారు…

వైసీపీలో రాజ్యసభ సభ్యులు జంప్ చేస్తారు అని ప్రచారం సాగుతున్న దగ్గర నుంచి ఒక పేరు విషయం మాత్రం బాగా నలుగుతోంది. ఆయన గురించే అంతా ఊహిస్తూ వైరల్ చేస్తున్నారు. ఆయన జంప్ చేస్తారు వైసీపీలో ఉండరని, ఆయనే గోడ దాటే మొదటి వారు అని కూడా పెద్ద ఎత్తున పొలిటికల్ స్పెక్యులేషన్ ని వదిలిపెట్టారు.

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు విషయంలోనే అనేక అనుమానపు తెరలను ముందు పెట్టారు. అయితే వీటన్నిటికీ గొల్ల బాబూరావు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తాను వైఎస్సార్ భక్తుడిని అని ఒకే మాటతో స్పష్టత ఇచ్చేశారు.

తాను 2009లో వైయస్సార్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చాను అని గతాన్ని గుర్తు చేసుకున్నారు. తాను నాటి నుంచే వైఎస్సార్ కుటుంబానికి నిబద్ధతతో కూడిన నాయకుడిగా ఉంటూ వచ్చాను అని చెప్పారు. తాను పార్టీ మారుతాను అని వస్తున్న వార్తలు అయితే బాధను కలిగించాయని ఆయన అన్నారు. ఇదే విషయం మీడియా ద్వారా అందరికీ చెబుతున్నాను అని తాను వైసీపీని వీడను అని ఆ పార్టీతోనే తన రాజకీయ జీవితం కొనసాగుతుందని చెప్పి అనుమానపు మేఘాలకు బాబూరావు తెర దించేశారు.

బాబూరావు 2009లో ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ స్వచ్చందంగా ఉద్యోగాన్ని వదిలి పాయకరావుపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన మరణం తరువాత వైసీపీలో చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి కూడా మరోసారి గెలిచారు. 2019లో మూడవసారి గెలిచారు. 2024లో ఆయనకు టికెట్ దక్కలేదు. రాజ్యసభకు పార్టీ పంపించింది. ఆయన పదవీ కాలం 2030 దాకా ఉంది. ఆరేళ్ల నిండు పదవీకాలం ఉన్న బాబూరావు వైసీపీతోనే అని చెప్పడం పట్ల ఆ పార్టీలో ఒక ఆత్మ విశ్వాసం కనిపిస్తోంది.

16 Replies to “వైఎస్సార్ భక్తుడిని.. అంతే !”

    1. నచ్చక!

      Y.-.C.-.P అని కలిపి రా. యి ఆ పార్టి గురించి ఎదొ రాస్తున్నావు అనుకొని డెలీటె చెసారు. TDP అని మాత్రం రాయ వచ్చ్.

      ల.-.క్ష కొ.-.ట్లు అని కలిపి రాయి. డెలీట్ చెసారు

      సై.-.కొ, అని కాని తు.-.గ్ల.-.క్ అని కలిపి రాయి. డెలీట్ చెసారు. బొల్లి, పప్పు అని మాత్రం రాసుకొవచ్చు

      జై.-.లు అని కాని కె.-.సు అని కలిపి రాయ్. డెలీట్ చెసారు.

      .

      1. లేదండీ నేను ఏ పార్టీ పేరు/వ్యక్తి గురించి ప్రస్తావించలేదు.

        “దేశంలో ఇతర సమస్యల గురించి కూడా రాయండి” అని కామెంట్ చేశాను. అందుకే moderate చేశారు.

  1. వై*ఎస్ఆర్ భక్తుడువు ఐతే , ఆయన భార్య నీ పదవి లో నుండి పీకేస్తే, ఏమి పీకుతున్నావ్ ?

    ఆయన మ*రణం మీద సీబీ*ఐ విచారణా నీ వద్దు అని ఒక గూట్లే గాడు ఆ*పేస్తే ఏమి పీకుతున్నవ?

  2. Oery baabu rajakeeyaalanu prajasevaku vaadina naayakulu yento mandi vundagaa pka 420 gaadiki ( veedi govt lone kada mana phsycho prajala sommu dobbesindi)nenu bhaktidini antinnaave nee character endo okasaari choosko

Comments are closed.