మోపిదేవికి ఎమ్మెల్సీ!

త్వ‌ర‌లో టీడీపీలో చేర‌నున్న మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌నున్న‌ట్టు తెలిసింది. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారంలో వుండ‌గా మోపిదేవికి మంత్రి ప‌ద‌వి, ఆ త‌ర్వాత రాజ్య‌స‌భకు పంపిన సంగ‌తి తెలిసిందే. వైసీపీ అధికారం కోల్పోగానే,…

త్వ‌ర‌లో టీడీపీలో చేర‌నున్న మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌నున్న‌ట్టు తెలిసింది. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారంలో వుండ‌గా మోపిదేవికి మంత్రి ప‌ద‌వి, ఆ త‌ర్వాత రాజ్య‌స‌భకు పంపిన సంగ‌తి తెలిసిందే. వైసీపీ అధికారం కోల్పోగానే, త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని మోపిదేవికి గుర్తొచ్చింది. కార‌ణాలేవైనా ఆయ‌న వైసీపీని వీడారు. ఆ పార్టీ ద్వారా వ‌చ్చిన రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని కూడా వ‌దులుకుని విమ‌ర్శ‌ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు.

ఈ నేప‌థ్యంలో మోపిదేవి రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. మోపిదేవి స్థానంలో మ‌రొక‌రిని రాజ్య‌స‌భ‌కు టీడీపీ పంప‌నుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మోపిదేవికి ఎమ్మెల్సీ ప‌ద‌వితో స‌రిపెట్ట‌నున్నారు. స్థానిక రాజ‌కీయాల్లో కొన‌సాగాల‌నే ఆస‌క్తి వుంద‌ని ఇప్ప‌టికే మోపిదేవి ప్ర‌క‌టించారు. అయితే వ‌రుస‌గా మూడు సార్లు రేప‌ల్లె నుంచి ఓడిపోయిన మోపిదేవికి చంద్ర‌బాబు సీటు ఇచ్చే ప‌రిస్థితి ఉండ‌దు.

అధికార పార్టీలో ఉన్నాన‌న్న సంతృప్తి ఒక్క‌టీ మోపిదేవికి మిగ‌ల‌నుంది. మోపిదేవి స్థానిక రాజ‌కీయాల్లో జోక్యం చేసుకుంటే టీడీపీ నాయ‌కులు స‌హించే ప‌రిస్థితి వుండ‌దు. ఆ విష‌యం మోపిదేవికి కూడా కూడా బాగా తెలుసు. అయితే పార్టీ వీడ‌డానికి సాకు కావాలి కాబ‌ట్టి, ఆ మాట చెప్పార‌ని అంటున్నారు.

సుదీర్ఘ కాలంగా వైఎస్సార్ కుటుంబంతో న‌డిచిన మోపిదేవి, రానున్న కాలంలో టీడీపీలో ఇమ‌డ‌డానికి మాన‌సికంగా కొంత క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. టీడీపీలో మోపిదేవి చేరి, ఆయ‌న అడుగుల‌పై ఆ పార్టీ నాయ‌కుల స్పంద‌న ఎలా వుంటుంద‌నేది ఆసక్తిక‌రంగా మారింది.

6 Replies to “మోపిదేవికి ఎమ్మెల్సీ!”

    1. అవునా .. మరి వీ డి అయ్య మహా మేత కి సీ ఎం పదవి, వీ డికి ఎం పీ సీట్ ఇచ్చిన కాంగ్రెస్ కి లెవెన్ మోహన్ రెడ్డి యే పోటు పొడిసాడు ? తండ్రి తరువాత తండ్రి అయిన బాబాయ్ కి యే పోటు పొడిసాడు ? ఆస్తులు , రాజకీయ వారసత్వం ఎగ్గొట్టటానికి చెల్లి కి యే పోటు పొడిసాడు ?

Comments are closed.