గొల్ల బాబూరావుతో జ‌గ‌న్ మాట్లాడి…!

రాజ్య‌స‌భ స‌భ్యుడు గొల్ల బాబూరావుతో మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడిన‌ట్టు తెలిసింది. వైసీపీని వీడే రాజ్య‌స‌భ స‌భ్యుల్లో గొల్ల బాబూరావు పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. ఇప్పుడాయ‌న మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్…

రాజ్య‌స‌భ స‌భ్యుడు గొల్ల బాబూరావుతో మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడిన‌ట్టు తెలిసింది. వైసీపీని వీడే రాజ్య‌స‌భ స‌భ్యుల్లో గొల్ల బాబూరావు పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. ఇప్పుడాయ‌న మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబంతో త‌న‌కు విడ‌దీయ‌లేని బంధం వుంద‌న్నారు. త‌న కంఠంలో ప్రాణం వున్నంత వ‌ర‌కూ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వెంటే ఉంటాన‌ని ఆయ‌న అన్నారు.

వైఎస్సార్ కుటుంబంతో గొల్ల బాబూరావుకు స‌న్నిహిత సంబంధాలున్నాయ‌నేది నిజం. వైఎస్సార్‌కు గొల్ల బాబూరావు ప‌ర‌మ భ‌క్తుడు. అయితే వైఎస్ జ‌గ‌న్‌తో బాబూరావుకు ఎమోష‌న‌ల్‌గా ఎటాచ్‌మెంట్ త‌క్కువే. బాబూరావుకు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇచ్చారు క‌దా, ఇంకేం కావాలి? అని ప్ర‌శ్నించే వాళ్లు లేక‌పోలేదు. దాంతో ఆయ‌న సంతృప్తి చెంద‌డం లేదు. త‌న‌తో జ‌గ‌న్ మాట్లాడ్డం ఎంతో గౌర‌వంగా ఆయ‌న భావిస్తున్నారు.

రాజ్య‌స‌భ‌లోనూ, వెలుప‌ల త‌న‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. అలాగే త‌న కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్‌ఫై భ‌రోసా కోరుకుంటున్నారు. అస‌లు త‌న‌కు జ‌గ‌న్ అపాయింట్‌మెంటే క‌రువైన నేప‌థ్యంలో వైసీపీలో ఇక భ‌విష్య‌త్ వుంటుంద‌ని ఆయ‌న అనుకోవ‌డం లేదు.

అందుకే ఆయ‌న పార్టీ వీడాల‌ని నిర్ణ‌యించుకున్న మాట వాస్త‌వం. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన వైసీపీ ముఖ్య నాయ‌కులు ఆయ‌న్ను రెండుమూడు రోజుల పాటు బుజ్జ‌గించారు. చివ‌రికి పార్టీలో కొన‌సాగేలా ఒప్పించి, బాబూరావు డిమాండ్స్‌పై జ‌గ‌న్‌తో మాట్లాడించి, హామీ ఇప్పించార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అందుకే త‌న‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చిన రెండు మూడు రోజుల త‌ర్వాత మాత్ర‌మే గొల్ల బాబూరావు స్పందించ‌డాన్ని గుర్తించుకోవాలి.

ఏది ఏమైతేనేం జ‌గ‌న్ ఫోన్‌లో మాట్లాడిన త‌ర్వాత గొల్ల బాబూరావు సంతృప్తి చెందారు. త‌న మ‌న‌సులోని ఆవేద‌నంతా వైసీపీ ముఖ్య నాయ‌కుల వ‌ద్ద వెల్ల‌డించి, భ‌విష్య‌త్‌లో తాను కోరుకున్న‌ట్టు జ‌రిగేలా బాబూరావు హామీ పొందిన‌ట్టు ప్ర‌స్తుతానికి వున్న స‌మాచారం.

5 Replies to “గొల్ల బాబూరావుతో జ‌గ‌న్ మాట్లాడి…!”

  1. వై*ఎస్ఆర్ భక్తుడువు ఐతే , ఆయన భార్య నీ పదవి లో నుండి పీకేస్తే, ఏమి పీకుతున్నావ్ ?

    ఆయన మ*రణం మీద సీబీ*ఐ విచారణా నీ వద్దు అని ఒక గూట్లే గాడు ఆ*పేస్తే ఏమి పీకుతున్నవ?

    మగతనం వుంటే మీ ప్యాలస్ పులకేశి గాడిని వై*ఎస్ఆర్ మరణం మీద విచారణ కావాలి అని ఒక్క మాట అనా మను.

    హోం మంత్రి గారు, వెంటనే సీ*ఐడీ విచారణా వేసి, మీ దే*ముడు వైఎ*స్ఆర్ నీ లేపేసిన ఇం*టి కొడి*కట్టి దొం*గ లని బొ*క్క లో వేస్తారు.

    ద*మ్ము వుందా ?

Comments are closed.