మొద‌టిసారి బాబు సీఎంగా.. ఎన్నెన్నో విమ‌ర్శ‌లు!

మొద‌టి సారి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబునాయుడు బాధ్య‌త‌లు చేప‌ట్టి నేటికి 29 ఏళ్లు సంవ‌త్స‌రాలు పూర్తి. 30వ ఏడాదిలో ఆయ‌న అడుగు పెట్టారు.

మొద‌టి సారి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబునాయుడు బాధ్య‌త‌లు చేప‌ట్టి నేటికి 29 ఏళ్లు సంవ‌త్స‌రాలు పూర్తి. 30వ ఏడాదిలో ఆయ‌న అడుగు పెట్టారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కేంద్ర‌, జిల్లా కార్యాల‌యాల్లో సంబ‌రాలు నిర్వ‌హించ‌నున్నారు. ఫొటో ఎగ్జిబిష‌న్లు ఏర్పాటు చేయ‌నున్నారు. అధికారంలో వుండ‌డంతో స‌హ‌జంగానే ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

అయితే చంద్ర‌బాబు ఎలా సీఎం అయ్యార‌నేది చ‌ర్చ‌కు రాకుండా టీడీపీ అనుకూల మీడియా జాగ్ర‌త్తలు తీసుకోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. త‌న‌కు పిల్ల‌నిచ్చిన‌, రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను ఇచ్చిన ఎన్టీఆర్‌ను ప‌ద‌వీచ్యుతుడిని చేసి, ఆయ‌న స్థానంలో చంద్ర‌బాబు సీఎం గ‌ద్దెనెక్కారు.

1995, సెప్టెంబ‌ర్ 1న మొద‌టిసారి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అంత‌కు ముందు 1994లో ఎన్టీఆర్ సార‌థ్యంలోని టీడీపీకి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌య‌పాలైంది. నాడు ల‌క్ష్మీపార్వ‌తిని రెండో పెళ్లి చేసుకుని ఎన్టీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. వృద్ధాప్యంలో ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవ‌డాన్ని జ‌నం ప‌ట్టించుకోలేదు. ప్ర‌జ‌లు ఆద‌రించారు.

ఎన్టీఆర్ ఏడాది పాల‌న గ‌డ‌వ‌గానే ల‌క్ష్మీపార్వ‌తిని సాకుగా చూపి, చంద్ర‌బాబు రాజ‌కీయ వ్యూహాన్ని ప‌న్నారు. ల‌క్ష్మీపార్వ‌తి రాజ్యాంగేత‌ర శ‌క్తిగా న‌డుచుకుంటోందని, ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తోందంటూ చంద్ర‌బాబు త‌న అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం మొద‌లు పెట్టారు. ప‌క్కా వ్యూహంతో ఎన్టీఆర్‌కు వ్య‌తిరేకంగా ఎమ్మెల్యేల‌ను కూడ‌గ‌ట్టారు. హైద‌రాబాద్‌లోని వైస్రాయ్ హోట‌ల్‌లో క్యాంప్ రాజ‌కీయానికి తెర‌లేపారు.

వైస్రాయ్ హోట‌ల్ వ‌ద్ద‌కు వెళ్లిన ఎన్టీఆర్‌, ఆయ‌న వెంట ఉన్న కొంద‌రు ఎమ్మెల్యేల‌పై చెప్పులు, రాళ్లు చంద్ర‌బాబు వేయించార‌నేది ఆరోప‌ణ‌. చివ‌రికి ఎన్టీఆర్ త‌న ప‌ద‌వి నిలుపుకోలేక పోయారు. 45 ఏళ్ల వ‌య‌సులో చంద్ర‌బాబు మొద‌టిసారిగా ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

చంద్ర‌బాబు మోసాన్ని ఎన్టీఆర్ జీర్ణించుకోలేక‌పోయారు. బాబును ద‌శ‌మ గ్ర‌హంగా, ఔరంగ‌జేబుగా ఎన్టీఆర్ అభివ‌ర్ణించారు. కేవ‌లం చంద్ర‌బాబుపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ ఎన్టీఆర్ ఒక వీడియోను ఆ కాలంలోనే విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. బాబును నీచుడిగా, దుర్మార్గుడిగా విమ‌ర్శిస్తూ ఎన్టీఆర్ నిప్పులు చెరిగారు. మోసానికి గుర‌య్యాన‌నే బాధ‌తోనే చివ‌రికి ఎన్టీఆర్ ప్రాణాలు కోల్పోయార‌నే వాద‌న బ‌లంగా వుంది.

నాటి నుంచి చంద్ర‌బాబును వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా స‌మాజం పిలుచుకుంటోంది. నాటి నుంచి బాబుపై ఎన్నెన్నో విమ‌ర్శ‌లు. తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, బామ్మ‌ర్ది నంద‌మూరి హ‌రికృష్ణ కూడా చంద్ర‌బాబు చేతిలో తాము మోస‌పోయి, ఎన్టీఆర్‌ను ప‌ద‌వీచ్యుతుడిని చేసిన పాప కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు అయ్యామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు ద్రోహ రాజ‌కీయంపై ద‌గ్గుబాటి ఏకంగా పుస్త‌క‌మే రాశారు.

ఇప్పుడు అంతా క‌లిసిపోయారు. అది వేరే సంగ‌తి. అధికారం, డ‌బ్బు పాత విష‌యాల్ని మ‌రిపింప‌జేస్తుంద‌నేందుకు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, చంద్ర‌బాబు రాజ‌కీయ ఏకం కావ‌డమే నిద‌ర్శ‌నం. బాబుపై గిట్ట‌ని వాళ్లు ఎన్నైనా విమ‌ర్శ‌లు చేయొచ్చు. కానీ నాలుగోసారి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఘ‌న‌త ఆయ‌న సొంతం చేసుకున్నారు. రాజ‌కీయాల్లో కుట్ర‌లు, మోసాలు స‌ర్వ‌సాధార‌ణ‌మైన‌ప్పుడు, బాబు చేసిన త‌ప్పేంట‌ని ఆయ‌న్ను అభిమానించే వాళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. బాబు రాజ‌కీయ పంథాను మెచ్చుకునే వాళ్ల సంఖ్య త‌క్కువేం కాదు.

30 Replies to “మొద‌టిసారి బాబు సీఎంగా.. ఎన్నెన్నో విమ‌ర్శ‌లు!”

  1. చెప్పటానికి blue media ga నువ్వు ఉన్నావ్ గా చాల్లే !! democracy అంటేనే అది, అధికారమైనా , పార్టీ అయినా బలమున్నోడిదే రాజ్యం !!

  2. If NTR/Lashimi Parvathi continued as Chief minister at that time, what would be the end result?

    We shouldn’t think it in an emotional way! Ultimately, who developed the state determines the future of people.

  3. సరే…అయితే ఏంటి? రేపే రెండో తారీకు…

    పాతబస్తీ గొడవలు, కత్తిపోట్లు, నిత్య అసమ్మతి నేతగా ముద్ర, ఇవన్నీ కూడా రాస్తావా మరి?

  4. Babu is very clever and excellent in Media management. Hitech city foundation done by n janardhan reddy and we know who inagurated became as a visionary. When he bacame cm in 1995 he never put ntr photo also govt ads.. Only after ntr demise babu started putting garlands to his statue. One general election with congres immediately after defeat start praising bjp and modi via interviews.Politics must be learnt by other politicians.do whatever but get power, ntr even denied of opprtunity of speaking in assembly during and post 1995 coup

Comments are closed.