సినీ నటులు నరేశ్, పవిత్ర మధ్య పెనువేసుకున్న బంధం… చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల మధ్య అల్లుకున్న ప్రేమానుబంధాన్ని తలపిస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసానికి పవన్‌కల్యాణ్ వెళ్లడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. వీళ్లిద్దరి మధ్య సాగుతున్న అనైతిక అనుబంధం గురించి తామెప్పుడూ చెప్పామంటూ వైసీపీ మంత్రులు, నేతలు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.
మరోవైపు నెటిజన్లు తమ సృజనాత్మకతకు పదును పెట్టారు. ఇటీవల పవిత్రను తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు సీనియర్ నటుడు నరేశ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పవిత్రను ముద్దాడుతూ మరీ ఈ విషయాన్ని ఆయన ప్రకటించడం గమనార్హం. వీళ్ల మధ్య మరోసారి నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి ఎంటర్ అయ్యారు. విడాకులు తీసుకోకుండానే పవిత్రను ఎలా పెళ్లాడతారని ఆమె ప్రశ్నిస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు ఇవ్వనని, పెళ్లి జరగనివ్వనని ఆమె తేల్చి చెప్పారు. ఈ ముగ్గురి మధ్య సాగుతున్న ప్రణయ కలహాలను వర్తమాన రాజకీయాలతో పోల్చుతూ నెటిజన్లు చంద్రబాబు, పవన్‌ను ఉతికి ఆరేస్తున్నారు.
ఏపీ రాజకీయాల్లో బీజేపీని రమ్యతో, అలాగే పవిత్రగా పవన్, నిత్య పెళ్లి కొడుకుగా చంద్రబాబును పోల్చుతూ సెటైర్స్ విసురుతున్నారు. బీజేపీకి విడాకులు ఇవ్వకుండానే చంద్రబాబుకు పవన్ దగ్గరవడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
మంచోచెడో పవిత్రను పెళ్లి చేసుకుంటున్నట్టు నరేశ్ బహిరంగంగా ప్రకటించారని, పవన్‌తో బంధంపై చంద్రబాబు నాన్చివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని వెటకరించడం గమనార్హం. పవన్‌తో పెళ్లికంటే సహజీవనమే సో బెటర్ అని చంద్రబాబు అనుకుంటున్నారనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఒకవైపు నరేశ్‌తో పవిత్ర చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నా, తనకింకా ఆ మొగుడు కావాలనే రమ్య వెంటపడుతున్న చందంగా, చంద్రబాబుతో ముద్దుముచ్చట్లలో తలమునకలైన పవన్‌తోనే కాపురం చేస్తానని బీజేపీ అంటోందని నెటిజన్లు పోల్చుతూ అందరి దృష్టి ఆకర్షించడం విశేషం. ఈ పోలిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.