గూగుల్ విశాఖను ఏనాడో గుర్తించిందట…!

ఏపీ రాజధాని ఏదీ అని బుర్రలు బాదుకునే వారికి గూగుల్ ఒక్కసారి కొట్టమని అంటున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. గూగుల్ లో సెర్చ్ చేస్తే చాలు ఏపీ రాజధాని విశాఖపట్నం అని దర్జాగా చెబుతుందిట.…

ఏపీ రాజధాని ఏదీ అని బుర్రలు బాదుకునే వారికి గూగుల్ ఒక్కసారి కొట్టమని అంటున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. గూగుల్ లో సెర్చ్ చేస్తే చాలు ఏపీ రాజధాని విశాఖపట్నం అని దర్జాగా చెబుతుందిట. విశాఖకు గూగుల్ ఆ హోదాను ఏనాడో కట్టబెట్టిందట. విశాఖకు అంతటి పొటెన్షియాలిటీ ఉంది కాబట్టే రాజధాని రాజసం దానంతట అదే వస్తోందని ఆయన అంటున్నారు.

జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించి మంచి నిర్ణయం తీసుకున్నారు అని స్పీకర్ కితాబు ఇచ్చారు. విశాఖకు విశాలమైన తీర ప్రాంతం ఉందని, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ గా మారుతోందని ఆయన చెప్పారు. విశాఖ రాజధాని అంటే పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని ఆయన అంటున్నారు.

పెట్టుబడిదారులు అంతా విశాఖ మీదనే ఆసక్తి చూపిస్తారు అని గతంలో కూడా అదే రుజువు అయిందని ఆయన గుర్తు చేస్తున్నారు. ఒక రాజధానికి ఉండాల్సిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయని, కనెక్టివిటీ పరంగా విశాఖ నంబర్ వన్ ప్లేస్ లో ఉందని స్పీకర్ విశ్లేషించారు.

ముఖ్యమంత్రి జగన్ నిజంగా అధ్బుతమైన నిర్ణయం తీసుకున్నారు అని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు అని సీతారాం అంటున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పాలిస్తే అదే రాజధాని అని ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదని అన్నారు. జగన్ తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతాను అని చెప్పారని, ఆయన విశాఖ నుంచి పాలించడం ద్వారా ఈ ప్రాంతానికి రాజధాని హోదాను ఇచ్చారని తమ్మినేని సీతారాం అంటున్నారు.