ఉద్యోగాల నుంచి మూకుమ్మడి ఉద్వాసన?

విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో అనేక రకాలైన ఆలోచనలను యాజమాన్యం చేస్తోంది. ఈ మధ్యలో రెండు వేల అయిదు వందల మంది ఉక్కు కార్మికులను ఇక రావద్దు అంటూ ఆదేశాలు ఇచ్చి పక్కన పెట్టేయడంతో…

విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో అనేక రకాలైన ఆలోచనలను యాజమాన్యం చేస్తోంది. ఈ మధ్యలో రెండు వేల అయిదు వందల మంది ఉక్కు కార్మికులను ఇక రావద్దు అంటూ ఆదేశాలు ఇచ్చి పక్కన పెట్టేయడంతో పెద్ద దుమారమే చెలరేగింది. దాంతో ఉక్కు కార్మిక సంఘాలు భారీ స్థాయిలో ఉద్యమించాయి. ఫలితంగా మళ్ళీ వారిని తీసుకుంటున్నామని ప్రకటించాల్సిన అనివార్యత ఏర్పడింది.

ఇపుడు మరో ఎత్తుగడతో విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం ఉందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందుకోసం వీఆర్ఎస్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయని అంటున్నారు. వీఆర్ఎస్ ద్వారా కార్మికులను తొలగించాలని అనుకుంటున్నట్లుగా కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు వీఆర్ఎస్ సర్వే పేరుతో ఉక్కు యాజమాన్యం చూస్తోందని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ హ్యూమన్ రీసోర్స్ డిపార్ట్మెంట్ పాలసీల నిబంధనల విభాగం ఈ మేరకు 10/24 పేరుతో ఒక సర్క్యులర్ ని విడుదల చేసింది.

దీని ప్రకారం ఎంప్లాయీస్ పోర్టల్ సపోర్ట్ సిస్టం లో వీఆర్ ఎస్ కోసం సిద్ధంగా ఉన్న వారు తమ పేర్లను ఈ నెల 29వ తేదీలోగా తెలియచేయాలని కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ అధికారులు, పర్మనెంట్ కార్మికులు తమ సమ్మతిని తెలియచేయాలని సూచించారు. 15 ఏళ్ల సర్వీసు 45 ఏళ్ళ వయసు నిబంధనగా విధించారు.

అయితే వీఆర్ఎస్ పేరుతో ఉద్యోగులను తొలగించే కుట్ర జరుగుతోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఒక వైపు స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేస్తామని చెబుతూనే మరో వైపు ఈ చర్యలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పట్టాలీ అంటే 19 వేల మంది అధికారులు పర్మనెంట్ కార్మికులు అవసరంగా ఉండగా ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో 12,700 మంది మాత్రమే ఉన్నారు.

వీఆర్ఎస్ పేరుతో వీరిని కూడా మూకుమ్మడిగా ఉద్వాసన పలికే ప్రయత్నం చేస్తే స్టీల్ ప్లాంట్ ఇక మూతపడుతుందని అంటున్నారు. ఉద్యోగుల తగ్గింపు ప్రక్రియను విరమించుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

4 Replies to “ఉద్యోగాల నుంచి మూకుమ్మడి ఉద్వాసన?”

  1. No need for public sector industries. Let them also work hard like private sector employees with no job security. And reservations should be implemented in both private sector employment and education

Comments are closed.