కింజరాపు కుటుంబం తిరిగి ఏమిచ్చింది?

ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరున్న శ్రీకాకుళం నుంచి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలను కింజరాపు కుటుంబం శాసిస్తోంది. 1983 నుంచి మొదలైన కింజరాపు కుటుంబం రాజకీయం ఇపుడు నవతరంతో సరికొత్తగా పయనిస్తోంది. Advertisement అప్పట్లో…

ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరున్న శ్రీకాకుళం నుంచి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలను కింజరాపు కుటుంబం శాసిస్తోంది. 1983 నుంచి మొదలైన కింజరాపు కుటుంబం రాజకీయం ఇపుడు నవతరంతో సరికొత్తగా పయనిస్తోంది.

అప్పట్లో ఎర్రన్నాయుడు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పలు మార్లు గెలిచారు. ఆ తరువాత నాలుగు సార్లు ఎంపీ అయ్యారు, కేంద్రంలో మంత్రిగా రైల్వే బోర్డు చైర్మన్ గా పనిచేశారు. టీడీపీలో కూడా కీలకమైన భూమికను పోషించారు. ఆయన ఎంపీ కావడంతో ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు 1996 నుంచి ఎమ్మెల్యేగా నెగ్గుతూ వస్తున్నారు. ఆయన కూడా 2014 నుంచి 2019 అలాగే ఇపుడు మరోసారి మంత్రిగా ఉంటున్నారు

ఎర్రన్నాయుడు వారసుడు రామ్మోహన్ నాయుడు మూడు సార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా నెగ్గారు. ఆయన కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలో పౌర విమాన యాన శాఖ మంత్రిగా ఉంటున్నారు. ఈ విధంగా కింజరాపు కుటుంబానికి శ్రీకాకుళం ఎంతో చేసిందని మరి జిల్లాకు వారు ఏమి చేశారు అన్న ప్రశ్న ఉండనే ఉంది.

ఆ విషయాన్ని వైసీపీ టెక్కలి ఇంచార్జి పేడాడ తిలక్ లేవనెత్తారు. సిక్కోలు నుంచి ఎంతో పొందిన కింజరాపు ఫ్యామిలి జిల్లా అభివృద్ధిని ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రగతిని మరిచారని ఆయన ఘాటు విమర్శలు చేశారు. పైగా వైసీపీ హయాంలో అభివృద్ధిని తమ గొప్పగా చెప్పుకునే స్థితికి వచ్చారని అన్నారు.

టెక్కలి నియోజకవర్గంలోని మూలపేట పోర్టుని రెండేళ్ళ క్రితం జగన్ ప్రారంభించారని ఇపుడు ఆ పోర్టు పనులు 70 శాతం పూర్తి అయ్యాయి దానిని కూటమి ప్రభుత్వం ఆపేసి మళ్లీ మొదటి నుంచి మొదలెట్టాలనుకోవడమేంటి అని ఆయన నిలదీశారు. దీని వెనక స్వార్ధ రాజకీయం ఉందని అన్నారు.

పోర్టు యాజమాన్యాన్ని కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి దోచుకోవడం కోసమే పోర్టు నిర్మాణం పనులు నిలుపుదల చేసారు అని అన్నారు. గతంలో పోర్టు అంటూ ప్రకటనలు తప్ప ఏమీ చేయలేక టీడీపీ ప్రభుత్వం చతికిలపడితే జగన్ వచ్చాక భూసేకరణ జరిపి అన్ని అడ్డంకులు తొలగించి పోర్టు నిర్మాణానికి రాచబాట వేశారని పేడాడ గుర్తు చేశారు.

ప్రజలకు ఈ విషయాలు అన్నీ తెలుసు అని జిల్లాకు ఒక్క మంచి పని కూడా చేయని కింజరాపు కుటుంబం పదవులు మాత్రం కేంద్ర రాష్ట్ర స్థాయిలోలో దశాబ్దాలుగా అనుభవిస్తోందని ఆయన హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనికి కింజరాపు వైపు నుంచి రియాక్షన్ ఏమి వస్తుందో చూడాల్సి ఉంది.

7 Replies to “కింజరాపు కుటుంబం తిరిగి ఏమిచ్చింది?”

  1. జనాలకి మంచి చేయకపోయినా పర్లేదు… కానీ మనకి మంచి అన్నది తెలియదు కదా..

    ఓటమి అన్నది లేకుండా గెలిపిస్తున్నారు అంటే అర్ధం ప్రజలు ఇష్టపడుతున్నారు అనే కదా

Comments are closed.