ప్లాంట్‌లో పనిష్మెంట్ల పర్వం

ఈ నెల 14న విశాఖ ఉక్కుని సెయిల్ లో విలీనం చేయమని కోరుతూ భారీ నిరసన కార్యక్రమాలను చేపట్టడానికి కార్మిక సంఘలౌ అన్నీ సమాయత్తం అవుతున్నాయి.

ఘనత వహించిన విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇప్పుడు పనిష్మెంట్ల పర్వం కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెబుతూ వస్తున్నారు పాలకులు. కార్మికులను ఉద్యోగులను కంటికి రెప్పగా చూస్తామని కూడా హామీ ఇస్తున్నారు. అయితే ప్లాంట్ లోని విషయాలను తమ సాధక బాధలను సమస్యలను కార్మిక సంఘాల నాయకులు మీడియాకు చెబుతున్నారని వారికి పనిష్మెంట్లు ఇస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు మండిపోతున్నారు.

స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులకు జీతాలు వేళకు ఇవ్వడం లేదని కార్మికులు అంటున్నారు. అలాగే వీఆర్ఎస్ మీద ఉద్యోగులను ఇంటికి పంపుతున్నారని అన్నారు. కాంట్రాక్టు కార్మికులను ఆరు వందల మంది దాకా తొలగించాలని కూడా చూస్తున్నారని అన్నారు.

ఈ విషయాల మీద పోరాడుతున్న కార్మిక సంఘాల నాయకులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ పనిష్మెంట్లకు గురి చేయడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఉక్కు కార్మిక నేతకు ఇచ్చిన షోకాజ్ నోటీసుకుని తక్షణం వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే ఈ నోటీసులు ఇచ్చారని వారు అంటున్నారు. ఇటీవల విశాఖ వచ్చిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉక్కు కర్మాగారాన్ని ఆదుకుంటున్నామని చెప్పారని వారు అంటున్నారు. కానీ కార్మిక నాయకుల మీద వేధింపులు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఈ నెల 14న విశాఖ ఉక్కుని సెయిల్ లో విలీనం చేయమని కోరుతూ భారీ నిరసన కార్యక్రమాలను చేపట్టడానికి కార్మిక సంఘలౌ అన్నీ సమాయత్తం అవుతున్నాయి. విశాఖ ఉక్కు మీద ప్రైవేట్ కత్తి వేలాడుతూనే ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.

2 Replies to “ప్లాంట్‌లో పనిష్మెంట్ల పర్వం”

Comments are closed.