పవన్ సినిమాలో నిధి పాత్ర ఇదే

హరిహర వీరమల్లు సినిమాలో తన క్యారెక్టర్ గురించి బయటపెట్టింది నిధి అగర్వాల్. మహిళా దినోత్సవం సందర్భంగా మేకర్స్ ఈమె వీడియోను రిలీజ్ చేశారు.

హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది నిధి అగర్వాల్. సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ రిలీజైంది. తాజాగా రిలీజ్ చేసిన ఓ సాంగ్ లో కూడా నిధి అగర్వాల్ కనిపించింది.

ఈ సినిమాలో ఆమె క్యూట్ గా కనిపిస్తూ, డాన్సులు చేస్తూ హీరోతో ఆడిపాడుతుందని చాలామంది అనుకుంటున్నారు. తనది అలాంటి పాత్ర కాదంటోంది నిధి అగర్వాల్. హరిహర వీరమల్లు సినిమాలో తన పాత్ర ఛాయల్ని ఆమె బయటపెట్టింది.

“హరిహర వీరమల్లు సినిమాలో పంచమి అనే పాత్ర పోషిస్తున్నాను. పంచమి చాలా స్ట్రాంగ్, స్వతంత్రురాలు. సినిమాలో పంచమికి ఓ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆమెకొక లక్ష్యం ఉంటుంది. చాలామంది సినిమాలో నా పాత్ర అందంగా, మంచి డాన్సులు చేస్తూ ఉంటుందని అనుకుంటున్నారు. కానీ పంచమి చాలా ధైర్యవంతురాలు, తెలివైంది కూడా.”

ఇలా హరిహర వీరమల్లు సినిమాలో తన క్యారెక్టర్ గురించి బయటపెట్టింది నిధి అగర్వాల్. మహిళా దినోత్సవం సందర్భంగా మేకర్స్ ఈమె వీడియోను రిలీజ్ చేశారు.

4 Replies to “పవన్ సినిమాలో నిధి పాత్ర ఇదే”

    1. అవునా నిజమా…. ఎనిమిది. సున్నా. ఒకటి. తొమ్మిది. ఆరు. ఒకటి. ఒకటి. నాలుగు. నాలుగు. ఎనిమిది

Comments are closed.