వైజయంతితో అర్జున్ మాస్

సినిమాలో వైజయంతీ ఐపీఎస్ గా విజయశాంతి, ఆమె కొడుకు అర్జున్ గా కల్యాణ్ రామ్ కనిపించబోతున్నారు.

సన్నాఫ్ సత్యమూర్తి, సూర్య సన్నాఫ్ కృష్ణన్.. ఇలా కొడుకు సెంట్రిక్ గా సినిమాలొచ్చాయి. దాదాపు ఇదే తరహా టైటిల్ తో కల్యాణ్ రామ్ సినిమా కూడా రెడీ అయింది. ఈ హీరో కొత్త సినిమాకు అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే టైటిల్ పెట్టారు.

సినిమాలో వైజయంతీ ఐపీఎస్ గా విజయశాంతి, ఆమె కొడుకు అర్జున్ గా కల్యాణ్ రామ్ కనిపించబోతున్నారు. టైటిల్ కు న్యాయం చేస్తూ, తల్లీకొడుకు పాత్రలు రెండింటినీ కలిపి పోస్టర్ వేశారు. ఇంతకుముందే ఈ రెండు పాత్రల ఫస్ట్ లుక్స్ రిలీజైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాపై ఇండస్ట్రీలో బజ్ మామూలుగా లేదు. సినిమా ఏదో మేజిక్ చేయడం గ్యారెంటీ అనే టాక్ నడుస్తోంది. కల్యాణ్ రామ్ ఫిల్మోగ్రఫీ ప్రకారం చూసుకుంటే, ఇది మరో పటాస్ లేదా ఇంకో బింబిసార అవుతుందనే పాటిజివ్ సెంటిమెంట్ కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో ఒక్క పాట హిట్టయితే, సినిమా రైట్ ట్రాక్ లో పడ్డట్టే.

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోహైల్ ఖాన్ విలన్. అజనీష్ లోకనాధ్ కంపోజర్.

4 Replies to “వైజయంతితో అర్జున్ మాస్”

Comments are closed.