హీరో నాని నిర్మాతగా అందిస్తున్న సినిమా కోర్ట్. మరో వారంలో థియేటర్లలోకి వస్తోంది. విడుదలైన తరువాత ఎలా వుంటుంది అన్నది ఆకట్టుకునే కంటెంట్ ను బట్టి వుంటుంది. బట్ సినిమా అయితే టీనేజ్ లవ్ ప్లస్ సీరియస్ కోర్ట్ డ్రామా అని ట్రయిలర్ చెప్పేసింది. ఇలాంటి సినిమాను ఫస్ట్ డే అందరూ కలిసి చూడమని, ఒకవేళ నచ్చక పోతే తన సినిమా హిట్ 3 చూడవద్దని హీరో నాని ఓ నిర్మాతగా అపీల్ చేసారు. గతంలో కేరాఫ్ కంచరపాలెం టైమ్ లో కూడా నాని ఇదే తరహా అపీల్ చేసారు. తన సినిమా చూడవద్దు అనే లింక్ పెట్టారు. అందువల్ల జనం నాని ని, ఆయన మాటని నమ్ముతున్నారు.
సరే, కోర్ట్ సినిమా ఎలా వుంటుంది అన్న ఆలోచన పక్కన పెడితే ఆ సినిమాకు మంచి ఓపెనింగ్ ఒక్క రోజు పడతే చాలు. నిర్మాతగా నాని డబ్బులు వెనక్కు వచ్చేస్తాయి. నిజానికి ఇప్పుడు సరైన సీజన్ కాదు సినిమాలకు. 14న రెండు సినిమాలు, 21న ఒక సినిమా, 28న రెండు సినిమాలు వున్నాయి. కోర్ట్ సినిమా బాగుంటుంది అనే అభిప్రాయం వచ్చినా, ప్రేక్షకులు కనుక ఓటిటి లో చూడొచ్చు అని బై మిస్టేక్ ఫిక్స్ అయిపోతే సమస్య అవుతుంది. అందువల్ల వాళ్లని థియేటర్ కు డ్రయివ్ చేయాలి అంటే ఏదో సమ్ థింగ్ వుండాలి. అందుకే నాని ఇప్పుడు ఈ తరహా మాట ఇచ్చింది.
కోర్ట్ సినిమాను జస్ట్ 12 కోట్ల బడ్జెట్ తో తీసేసారు. 12 కోట్లు ఖర్చు అయిందన్నది యూనిట్ వర్గాల మాట. కానీ అంత చిన్న సినిమాకు ఆ మేరకు కూడా ఖర్చు అవుతుందా అన్న పాయింట్ వుండనే వుంది. పోనీ 12 కోట్లు ఖర్చయింది అనుకున్నా నాన్ థియేటర్ మీద నుంచే 8 కోట్లకు పైగా ఆదాయం రిటర్న్ వచ్చేసింది. అంటే ఇంక రావాల్సింది జస్ట్ నాలుగు కోట్లు.
సినిమా 60శాతం ఆక్యుపెన్సీతో కనుక డేవన్ ఓపెన్ అయినా చాలు. ఏపీ, సీడెడ్, నైజాం కలిపి టార్గెట్ చేరిపోవచ్చు. అలా కాకుండా లీస్ట్ ఓపెనింగ్ వచ్చి, ఓటిటి లో చూడొచ్చు అనే టాక్ వస్తే, ఇబ్బంది అవుతుంది. అందుకే అన్నీ ఆలోచించి, ఈ విధమైన పిలుపు ఇచ్చేసారు. అనుకున్న టార్గెట్ చేరిపోతారు. అందులో డౌట్ లేదు.
Waiting
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,