‘దేశం’లో కాపులకు చాన్స్ లేనట్లేనా?

కులాల సమతూకంలో భాగంగా తెలుగుదేశంలోని కాపులకు అన్యాయం జరిగే ప్రమాదం వుంది. లేదూ అంటే వారిని జనసేనలోకి చేర్చించి అక్కడ అవకాశం ఇవ్వాల్సి వుంటుందేమో?

తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ కులాల సమతూకం పాటిస్తూనే టికెట్ లు, పదవులు ఇస్తూ వస్తోంది బీసీలకు కాస్త పెద్ద పీటవేయడం అలవాటు. అలా అని కాపులను పక్కన పెట్టలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కాపులను పక్కన పెట్టాల్సి వస్తున్నట్లు కనిపిస్తోంది.

కూటమిలో భాగంగా జనసేనతో పొత్తు పెట్టుకుంది. భాజపాతో పొత్తు పెట్టుకుంది. జనసేన వైపు నుంచి ఎవరికి పదవులు సజెస్ట్ చేసినా కాపులే వుంటున్నారు. ముగ్గురు మంత్రుల్లో ఇద్దరు కాపులే. భాజపా వైపు నుంచి క్షత్రియులకు అవకాశం లభిస్తోంది.

దాంతో తెలుగుదేశం కమ్మ, రెడ్డి, బీసీలకు అవకాశం ఇవ్వాల్సి వుంటుంది. కాపులను పక్కన పెట్టాలి. అన్ని పార్టీల్లోనూ అన్ని వర్గాల వారు వుంటారు. ఎంత జనసేన వున్నా, తెలుగుదేశంలో కూడా పలువురు కాపు నాయకులు వున్నారు. వీరంతా ఏదో ఒక పదవి లేదా టికెట్ ఆసిస్తారు. కానీ అలా ఇచ్చే అవకాశం మాత్రం తగ్గిపోతోంది.

అటు జనసేన కాపులకే ఇచ్చి, ఇటు తేదేపా కాపులకే ఇస్తే మిగిలిన వారు అన్యాయం అయిపోతారు.అందువల్ల కాపుల కోటా అన్నది జనసేనకు వదిలేసి, మిగిలిన వారిని తెలుగుదేశం చూడాల్సి వుంది. జనసేన సీనియర్ అయిన కొణతాల రామకృష్ణ లాంటి వాళ్లను ఎలాగూ మంత్రి పదవులకు రికమెండ్ చేయడం లేదు. అందువల్ల కులాల సమతూకంలో భాగంగా తెలుగుదేశంలోని కాపులకు అన్యాయం జరిగే ప్రమాదం వుంది. లేదూ అంటే వారిని జనసేనలోకి చేర్చించి అక్కడ అవకాశం ఇవ్వాల్సి వుంటుందేమో?

34 Replies to “‘దేశం’లో కాపులకు చాన్స్ లేనట్లేనా?”

    1. ఎందుకు చెయ్యలేదు? CPSరద్దు అన్నోడిని చేశారు. మెడలు వంచి ప్రత్యేక హోదా అన్నోడిని చేశారు. అమరావతి రాజధాని అని మడమ తిప్పినోడిని చేసారు

  1. జగన్ నాయుడు గా మారతాడు అంటావా , ఇప్పుడు?

    రెడ్డి వేషం ఐపోయింది

    జోసెఫ్ వేషం ఐపోయింది.

    కోడి కత్తి , గుళాకరాయి వేషం ఐపోయింది.

    హిందూ వేషం ఐపోయింది.

    ఇప్పుడు కాపు కులం వేషం కోసం ట్రై చేస్తున్నాడు?

    1. అంబేద్కరుడు మీ ఇంటికి రాలేదు …

      మరి ఎలా….?? అరహతం అయ్యిందిలే…

      అందరు అంత వి!పుల0గా వుండరు కదా…

      విషయం ఏమైనా వుందా….లేక అనవసర బురద జల్లుడేనా ??

  2. జగన్ మాట నమ్మి పార్టీ మారిన మన కాపు పద్మనాభ నాయుడు కి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్ష పదవి ఎప్పుడు?

  3. ఎందుకో ఈ మధ్య వైసీపీ వాళ్ళకి కమ్మ, కాపుల మీద తెగ ప్రేమ పుట్టుకొచ్చింది. అదే కాపులుకి MLC ఇస్తే కాపులు , కమ్మలు కలిసి పంచుకున్నారు అని వ్రాయటానికి ఆర్టికల్ రెడీ గా వుంది నీ దగ్గర. ఏమీ పర్లేదు కూటమినుంచి నాగబాబు, మాధవ్ లేక సోము వీర్రాజు వుంటారు . అవి చాలవా?

Comments are closed.