దర్శకుడు నక్కిన త్రినాధరావు ఒక పక్క నిర్మాతగా రెండు చిన్న సినిమాలు చేస్తున్నారు. మరోపక్కన దర్శకుడిగా కోనేరు హవీష్ తో ఒక సినిమా స్టార్ట్ చేసారు. ఇప్పుడు నిర్మాత దిల్ రాజు కు ఓ సినిమా చేయబోతున్నారు.
దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ తో సినిమా ఫిక్స్ అయింది. ఆశిష్ ను ఎలాగైనా హీరోగా నిలబెట్టాలన్నది దిల్ రాజు ప్రయత్నం. ఒక సినిమా తీసారు. నడవలేదు. రెండో సినిమా తీసారు ఆడలేదు. మూడో సినిమా కొంచెం తీసి పక్కన పెట్టారు. సుకుమార్ వీలు చేసుకుని దాని మీద దృష్టి పెడితే తప్ప అది పూర్తి కాదు. ఎందుకంటే అది సుకుమార్ రైటింగ్స్ సినిమా.
ఈ లోగా గతంలో తమ బ్యానర్ కు ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చిన నక్కిన త్రినాధరావుతో ఒక సినిమా ఓకె చేయించారు. గమ్మత్తేమిటంటే దీనికి కథ నక్కినది కాదు. అలా అని బెజవాడ ప్రసన్నది కూడా కాదు. దిల్ రాజుకు సన్నిహితడైన ఓ దర్శకుడు దగ్గర వుంచి చేయించిన కథ. ఇప్పుడు అదే దర్శకుడు క్వాలిటీ కంట్రోల్ కూడా చేస్తారు.
1980 బ్యాక్ డ్రాఫ్ లో నడిచే భారీ సినిమా ఇది. కాస్త ఖర్చు ఎక్కువే. అయినా ఓ మంచి ఈవెంట్ ఫిల్మ్ తీసి, వారసుడిని నిలబెట్టాలని దిల్ రాజు పట్టుదలగా వున్నారు. దీని తరువాత కరుణాకరన్ తో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు.
Good hero
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,