బాబుకు ప‌ట్ట‌భద్ర‌ల ఎన్నిక‌లు రాజ‌కీయ ఉరి!

పీడీఎఫ్ అభ్య‌ర్థులు గెలిచినా, ఓడినా… కూట‌మి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, కార్మిక స‌మ‌స్య‌ల‌పై చాలా త్వ‌ర‌గా ఉద్య‌మాల‌కు దిగే అవ‌కాశం వుంది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌లు రాజ‌కీయంగా ఉరి అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండు స్థానాల‌కు ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిపై చంద్ర‌బాబు సీరియ‌స్‌గా దృష్టి సారించారు. ఏ ర‌కంగా చూసినా చంద్ర‌బాబు ఏరికోరి తెచ్చుకుంటున్న స‌మ‌స్య‌గా చూడాల్సి వుంటుంద‌ని సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు అంటున్నారు.

ఈ నెల 27న ఉమ్మ‌డి గుంటూరు-కృష్ణా, అలాగే ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ రెండు స్థానాల్లోనూ ప్ర‌ధానంగా టీడీపీ, పీడీఎఫ్ అభ్య‌ర్థుల మ‌ధ్యే పోటీ. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల నుంచి పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌రం (టీడీపీ), డీవీ రాఘ‌వులు (పీడీఎఫ్‌) త‌ల‌ప‌డుతున్నారు. అలాగే కృష్ణా-గుంటూరు జిల్లాల నుంచి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ (టీడీపీ), సిటింగ్ ఎమ్మెల్సీ ల‌క్ష్మ‌ణ‌రావు (పీడీఎఫ్‌) త‌ర‌పున నువ్వానేనా అనే స్థాయిలో పోటీ ప‌డుతున్నారు.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ బ‌రి నుంచి త‌ప్పుకుంది. అనివార్యంగా ఆ పార్టీ మ‌ద్ద‌తుదారులంతా టీడీపీకి వ్య‌తిరేకంగా, అంటే పీడీఎఫ్ అభ్య‌ర్థుల‌కు ఓట్లు వేసే అవ‌కాశం వుంది. ఈ ఎన్నిక‌లు టీడీపీకి చావో, రేవో తేల్చుకోవాల్సిన అనివార్య ప‌రిస్థితి. ఎందుకంటే ఈ రెండు ప్రాంతాల్లోనూ కూట‌మి రాజ‌కీయంగా బ‌లంగా వుంది. ఈ ధ‌పా ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసిన సంగ‌తి తెలిసిందే.

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి తొమ్మిదో నెల‌లో అడుగు పెట్టింది. రెండుస్థానాల్లో టీడీపీ గెలిచినా, ఓడినా కూట‌మికే రాజ‌కీయంగా న‌ష్టం. ఎలాగైనా గెలిచి తీరాల‌ని ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఆయా ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేల‌కు దిశానిర్దేశం చేశారు. దీంతో వాళ్లంతా ఎన్నిక‌ల్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

రెండు స్థానాల్లో గెల‌వ‌డానికి అధికార అండ‌తో స‌హ‌జంగానే తొక్క‌ని అడ్డ‌దారులుండ‌వ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇదే జ‌రిగితే, కూట‌మికి బ‌ల‌మైన శ‌త్రువును త‌న‌కు తానే త‌యారు చేసుకున్న‌ట్టే. ఒక‌వేళ గెలిచినా, దీర్ఘ‌కాలంలో దాని న‌ష్టం ఏంటో ముఖ్యంగా చంద్ర‌బాబుకు తెలిసొస్తుంది. వైసీపీ బ‌రిలో లేక‌పోవ‌డంతో, ఎన్నిక‌ల్ని ఈజీగా తీసుకునే ప‌రిస్థితి ఎంత‌మాత్రం లేదు.

ఎన్నిక‌లు సజావుగా సాగితే, రెండు చోట్ల టీడీపీ గెలుపు క‌ష్ట‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ రెండు చోట్ల టీడీపీ ఓడితే, కూట‌మి ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త‌కు ప్ర‌తిబింబంగా, ఫ‌లితాల్ని చూపి ప్ర‌తిప‌క్షం బ‌ల‌ప‌డుతుంది. గ‌తంలో రాయ‌ల‌సీమ‌లో రెండు, అలాగే ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో టీడీపీ గెలుపొంద‌డంతో కూట‌మికి ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎంతో ప్ర‌యోజ‌నం క‌లిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కేవ‌లం కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన తొమ్మిది నెల‌ల‌కే ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగితే మాత్రం, అధికారానికి కౌంట్‌డౌన్ మొద‌లైన‌ట్టే అని చెప్పాల్సిన ప‌నిలేదు.

ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో పీడీఎఫ్‌పై పోటీ పెట్ట‌డం వ‌ల్ల చంద్ర‌బాబునాయుడు అన‌వ‌స‌రంగా కొత్త శ‌త్రువుల్ని త‌యారు చేసుకున్నార‌ని చెప్పొచ్చు. పీడీఎఫ్‌ను బ‌ల‌ప‌రిచే ఓట‌ర్లంతా ఉద్యోగ, ఉపాధ్యాయ‌, కార్మిక‌, ప్ర‌జాసంఘాల‌కు చెందిన వాళ్లు. వీళ్ల‌కు వైసీపీ తోడైంది. మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వీళ్లంతా కూట‌మికి అండ‌గా నిలిచారు. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో త‌మ‌కు వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు అభ్య‌ర్థుల్ని నిలిపార‌న్న కోపం వాళ్ల‌లో త‌ప్ప‌క వుంటుంది. ఇవ‌న్నీ రానున్న రోజుల్లో రాజ‌కీయంగా, ప్ర‌ధానంగా టీడీపీకి శాపంగా మార‌నున్నాయి.

పీడీఎఫ్ అభ్య‌ర్థులు గెలిచినా, ఓడినా… కూట‌మి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, కార్మిక స‌మ‌స్య‌ల‌పై చాలా త్వ‌ర‌గా ఉద్య‌మాల‌కు దిగే అవ‌కాశం వుంది. ఇవ‌న్నీ చంద్ర‌బాబు ఏరికోరి తెచ్చుకున్న ప్ర‌మాదాలుగా చూడాలేమో! అందుకే ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు చంద్ర‌బాబు పాలిట రాజ‌కీయ ఉరి అని ప‌లువురి అభిప్రాయం. ఎన్నిక‌ల్లో వైసీపీ పోటీ చేయ‌కుండా, పీడీఎఫ్‌కు మ‌ద్ద‌తు ఇస్తూ, రాజ‌కీయంగా అత్య‌ధిక లాభం పొంద‌నుంది. త‌మ‌కు వైసీపీ మ‌ద్ద‌తు ఇచ్చింద‌న్న కృత‌జ్ఞ‌త త‌ప్ప‌క వుంటుంది. మ‌రీ ముఖ్యంగా ఉద్యోగ‌, ఉపాధ్యాయ వ‌ర్గాల్లో వైసీపీపై వ్య‌తిరేక‌త పోతుంది. అదంతా కూట‌మి వైపు వెళ్తుంది. ప‌ట్ట‌భద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వ‌ల్ల వ‌చ్చే రాజ‌కీయ మార్పులివే.

22 Replies to “బాబుకు ప‌ట్ట‌భద్ర‌ల ఎన్నిక‌లు రాజ‌కీయ ఉరి!”

  1. జనరల్ ఎలేచ్షన్స్ కి ఏడాది ముందర ..ఇవే పట్టభద్రుల ఎలేచ్షన్స్ లో మూడు స్తనాలు వైసీపీ ఓడిపోయింది .. అప్పుడు తమరికి ప్రజా వ్యతిరేకత కానరాలేదు .. ఇప్పుడు మాత్రం టీడీపీ ఓడిపోతే ప్రజా వ్యతిరేకత ఉందా ? అంత ప్రజా వ్యతిరేకత ఉంది అని నమ్మితే ..వైసీపీ పోటీ చేసి గెలిచి చూపించొచ్చు కదా ..పైగా బాలట్ పేపర్ ఎలేచ్షన్స్ ఆయె .. మిమల్ని మీరు బబ్యపెట్టుకుంటే ఎప్పటికి గెలిచేది లేదు ..

    1. వైసీపీ నిల్చుంటే.. ప్రజా వ్యతిరేకత ఓట్లు పిడిఎఫ్ కి వైసీపీ కి చీలిపోతాయి..

      అందుకే మన సింగల్ సింహం.. పిడిఎఫ్ కి సపోర్ట్ చేస్తున్నారు.. అంట..

      అంటే.. డైరెక్టుగా పొత్తు అని చెప్పకుండా.. గుడిసేటి కొంపలోకి దూరతారన్నమాట..

      ..

      సింగల్ సింహం పొత్తు పెట్టుకుంటే సంసారం.. అని చదువుకోండి సింపుల్ గా..

  2. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో..

    టీడీపీ గెలిచినా.. టీడీపీ కే నష్టం..

    టీడీపీ ఓడినా.. టీడీపీ కే నష్టం..

    అసలు సోదిలో లేకుండా పారిపోయిన .. వైసీపీ కి ఫుల్లుగా లాభం..

    అదేంటో.. ఎన్నికల్లో నిల్చోడానికే భయపడుతున్న వైసీపీ కి ఎలా లాభమో మాత్రం సస్పెన్స్.. ఆ ముక్క చెప్పరు .. చెప్పలేరు..

    ..

    గ్రేట్ ఆంధ్ర గత చరిత్ర చూద్దాం..

    గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో..

    వైసీపీ గెలిచినా.. టీడీపీ కే నష్టం..

    వైసీపీ ఓడినా.. టీడీపీ కే నష్టం..

    ఎందుకంటే.. వైసీపీ ఓటర్లు వేరే.. వాళ్ళు ఓట్లు వేయరు.. ఇలా సొల్లు చెపుతుంటారు..

  3. MLC ఎన్నికలు మాకు మొదట సారి, అనుభవం లేదు..మా ఓటర్లు వేరే వున్నారు… ఇలా అయితే ఏ పార్టీ మాట్లాడదు.ప్రజాస్వామ్యం లో పోటీ ఎప్పుడూ వుండాలి.. వుంటుంది, వుండనివ్వాలి.టీడీపీ గెలిస్తే సైట్ మూసేసుకుంటావా ఎంకీ?

    1. టీడీపీ గెలుస్తుందనే వాడు కూడా చెపుతున్నాడు..

      కాకపోతే.. టీడీపీ గెలిచినా.. వైసీపీ కే లాభం.. టీడీపీ కే నష్టం అనే కొండెఱిపూకు లాజిక్ ఒకటి కనిపెట్టాడు..

  4. ఇంత చిన్న దానికె రాజకీయా ఉరి ఎమిటిరా అయ్యా! మరీ పెద్ద పెద్ద మాట్లడు మాట్లాడుతున్నవ్! ఇంతకీ చూస్తె మన అన్న పరార్ అని కూడా మళ్ళి నువ్వె చెపుతున్నవ్!

  5. Worry అవ్వమాక. ఏ కుక్కకి ఎలా పెట్టాలో మాకు తెలుసు. గొర్రెలు పదకొండు సంగతే తెలవాలి.

  6. వచ్చే ఎలక్షన్ లలో టీడీపీ జనసేన విడివిడి గ కనుక పోటీచేస్తే మీరు తెలివిగా బీజేపీ ఎవరితో ఉంటుందో వాళ్ళకే మద్దతు ఇవ్వండి అది ఓడిపోయిన గెలిచినా మీకే లాభం బీజేపీ ఎటు సెంటర్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు బైళ్ళు స్టే లు పొడిగించుకోవచ్చు

  7. అబ్బా… ఏమి కవరింగ్ రా నాయనా… ఏంటీ రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఉద్యోగ సంఘాల వ్యతిరేకత కూటమికి వస్తుందా.. వైసీపీ మీద పోతుందా…. అసలు ఏమి రాస్తున్నావో తెలుస్తుందా

Comments are closed.