“అయ్యా, అమ్మా మేము నిఖార్సైన హిందువులం. చచ్చేంత వరకూ హిందూమతం సంస్కృతి, సంప్రదాయాల్నే పాటిస్తాం” అని నెత్తీనోరూ కొట్టుకుని చెప్తున్నా…. టీటీడీ విజిలెన్స్‌లోని ఓ “కళా”కారిణి మాత్రం అసలు ఒప్పుకోదు. అవన్నీ కుదరవు… మిమ్మల్ని క్రిస్టియన్ మతంలోకి మారుస్తానని ఆ “మతి” లేని ఆ “కళా” తన పై అధికారులకు నివేదిక ఇవ్వడం చర్చనీయాంశమైంది.
అన్యమతస్తుల పేరుతో హిందూ ఉద్యోగులపై చర్యలు తగదంటూ టీటీడీ బోర్డు సభ్యుడు ఇటీవల టీటీడీ ఈవో శ్యామలరావుకు వినతిపత్రం ఇచ్చారంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. టీటీడీ విజిలెన్స్‌లో పనిచేసే ఆ “మతి” లేని అధికారిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. ఆ అధికారి గురించి అప్పట్లోనే ఫిర్యాదులు వెల్లువెత్తినా, పట్టించుకోకుండా కొనసాగించిన ఘనత శ్రీమాన్ ధర్మారెడ్డికి దక్కుతుందని టీటీడీ ఉద్యోగులు తిట్టుకోని రోజులేదు.
ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ తదితర హిందూ ఆధ్మాత్మిక సంస్థలు నిర్వహించే సమావేశాల్లో శిక్షణ ఇచ్చే బ్రాహ్మణురాలైన టీటీడీ అత్యున్నత ఉద్యోగిని కూడా క్రిస్టియన్‌గా చూపిన విజిలెన్స్ కళ ఆ మతిలేని అధికారి సొంతం. అంతేకాదు, సదరు అత్యున్నత ఉద్యోగి భర్త విద్యార్థి దశలో ఏబీవీపీ, ఆ తర్వాత బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూపరిషత్‌లలో పని చేసిన గుర్తింపు వుంది. అయినప్పటికీ మీరిద్దరూ హిందువులు కాదని టీటీడీ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చి, వాళ్లను అన్యమతస్తుల జాబితాలో చేర్చి, ఎందుకు ప్రకటించారో సదరు అధికారికే తెలియాలి.
టీటీడీ అన్యమతస్తుల జాబితాలోని డొల్లతనంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తిరుపతిలో ఇవాళ్టి నుంచి మూడో రోజుల పాటు అంతర్జాతీయ దేవాలయాల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఏపీ, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులతో పాటు కేరళ గవర్నర్ కూడా హాజరుకానున్నారు. ప్రపంచ హిందూ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతి కావడంతోనే, ఇక్కడ సదస్సు నిర్వహించతలపెట్టారు. టీటీడీతో తిరుపతికి విశిష్టత వచ్చింది. అలాంటి టీటీడీ ఇతర మతస్తుల్ని హిందువులుగా మార్చడానికి బదులు, నిఖార్సైన హిందువుల్నే ఇతర మతస్తులనే అధికారిని ఎందుకు పెట్టుకున్నారో అనే విమర్శ బలంగా వినిపిస్తోంది.
వైసీపీ హయాంలో టీటీడీ విజిలెన్స్‌కు పట్టిన దరిద్రం ఎప్పటికి వీడుతుందో అని ఉద్యోగులు తిట్టుకోని రోజు లేదు. ఈ మహిళా అధికారికి టీటీడీ క్రమశిక్షణ కమిటీలో మరో అధికారిని తోడైందని టీటీడీ ఉద్యోగులు అంటున్నారు. హిందువుల్ని అన్యమతంలోకి పంపుతున్న విజిలెన్స్, క్రమశిక్షణ కమిటీలోని అధికారులను సాగనంపే ఆలోచన దిశగా అడుగులు పడాలి. అప్పుడు అంతర్జాతీయ దేవాలయాల సదస్సు నిర్వహణకు అర్థం, పరమార్థం అని టీటీడీ ఉద్యోగులు అంటున్నారు.
గొర్రి మతం లో ఉంటూ హిందువు అని చెప్పుకొని తిరుపతి లో ఉద్యోగం చేస్తున్న con ver ted లం జ కొ డుకులుnu తిరుపతి 7 va కొండనుంచి తోసేసేలా ఆదేశాలు ఇవ్వాలి
జై హిందు.
Yela sir ala
జెగ్గులు గాడు యిక్కడ అక్కడ అని కాకుండా రాష్ట్రం మొత్తం ‘ఏరిగాడు.. అదంతా కడగాలంటే చాలా టైం పట్టేట్టు ఉందే??
Enduku thammudu block chesavu
Photo teesukelli Cyber crime ki Este emavutundhoo telusaaa
కాల్ బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
. అప్పట్లో జగన్, సుబ్బరెడ్డి, కరుణాకర్ రెడ్డి అందరూ యేసు బిడ్డలే కదా. అయినా హిందువులుగా చెలామణి చేసుకున్నారు..