తెలుగుదేశం పార్టీ పుట్టాక ఆ పార్టీలో చేరి 1983లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి ఎన్టీఆర్ కేబినెట్ లో పలు కీలక మంత్రిత్వ శాఖలను చూసిన వారు కావలి ప్రతిభాభారతి. ఆమె ఉమ్మడి ఏపీలో 1999 నుంచి 2004 మధ్యలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉన్నత విద్యావంతురాలిగా ఉన్న ఆమె తన రాజకీయ వారసురాలిగా కుమార్తె గ్రీష్మను తీసుకుని వచ్చారు.
ఆమెకు రాజాం టికెట్ 2024 ఎన్నికల్లో దక్కలేదు. ఆనాడే పార్టీ ఆమెకు హామీ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఎమ్మెల్సీ పదవికి కావలి గ్రీష్మను ఎంపిక చేశారు. విద్యాధికురాలు పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న నేతగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గ్రీష్మకు పెద్దల సభకు పంపిస్తున్నారు.
ఆమెకు దీనికంటే ముందు కార్పోరేషన్ చైర్మన్ పదవి కూడా లభించింది. యువ నాయకురాలిగా ఆమె లోకేష్ టీం లో ఉన్నారని అంటున్నారు. పార్టీ భవిష్యత్తు నేతలను తయారు చేసుకునే క్రమంలో శ్రీకాకుళం జిల్లా నుంచి కావలి గ్రీష్మను టీడీపీ గుర్తించి ప్రోత్సహిస్తోంది అని అంటున్నారు.
వైసీపీ పాలనలో గ్రీష్మ ఫైర్ బ్రాండ్ గా నిలిచి అప్పటి అధికార పార్టీ మీద నిప్పులు చెరిగేవారు. అలా ఆమె అధినాయకత్వం దృష్టిలో పడ్డారు. రాజాం టికెట్ నిజానికి ఇవ్వాల్సి ఉన్నా వీలుపడకపోవడంతోనే ఆమెను ఎగువ సభకు తెచ్చారని అంటున్నారు. ఈ విధంగా ఉత్తరాంధ్ర నుంచి ఒక ఎమ్మెల్సీ పదవిని ఇచ్చినట్లుగా పార్టీ ప్రాంతీయ సమీకరణలను సరిచూసుకుందని అంటున్నారు.
ఉత్తరాంధ్రలో ఎంతో మంది ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నించారు. వారి పేర్లు వినిపించాయి. కానీ ఎక్కడా కనీసమాత్రంగా కూడా వినిపించని కావలి గ్రీష్మ పేరుని ఎంపిక చేయడం ద్వారా హైకమాండ్ తన విధానం ఏంటో చాటి చెప్పింది అని అంటున్నారు. తల్లి ప్రతిభాభారతి మాదిరిగానే గ్రీష్మ రాజకీయంగా ఏ విధంగా తన శైలిని రూపొందించుకుంటారో చూడాలని అంటున్నారు.
జెగ్గుల గాణ్ణి తొడగొట్టి సవాల్ చేసిన గ్రీష్మ..
ఇది టీడీపీ లో వున్న సామాజిక న్యాయం సాక్ష్యం. వైసీపీ లో సామాజిక న్యాయం లాగా రాష్ట్రాన్ని నాలుగు గా విభజించి నలుగురు సామంతులుకిచ్చినట్లు కాదు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,