అయ్యో రాజమౌళి.. ఎంత పనైంది!

ఎవరో ఆకతాయి ఈ సినిమా షూటింగ్ ను తన మొబైల్ లో రికార్డ్ చేశాడు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు.

“ఈసారి లీకులు గ్యారెంటీ రాజమౌళీ” అనే శీర్షికతో ఆల్రెడీ ఓ కథనం ఇచ్చింది గ్రేట్ ఆంధ్ర. రోజుల వ్యవథిలోనే మహేష్-రాజమౌళి సినిమా లీకుల బారిన పడింది. ఎవరో ఆకతాయి ఈ సినిమా షూటింగ్ ను తన మొబైల్ లో రికార్డ్ చేశాడు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు.

ఒరిస్సాలోని కోరాపుట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. చుట్టూ కొండలు, మధ్యలో భారీ మైదాన ప్రాంతం. అక్కడక్కడ వేసిన చిన్న చిన్న సెట్స్. వాటి మధ్య మహేష్ పై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ఈ షెడ్యూల్ లో మలయాళ నటుడు-దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడు. లొకేషన్ లో అతడు ఓ రకమైన వెరైటీ ఛెయిర్ లో కూర్చున్నాడు. అల్లంత దూరంలో మహేష్ నిల్చొని ఉన్నాడు. అతడ్ని రౌడీలు ముందుకు నెడుతున్నారు. ఈ సీన్ సోషల్ మీడియాలో లీక్ అయింది.

నిమిషాల వ్యవథిలో వైరల్ అయిన ఈ సన్నివేశాన్ని తొలిగించే పనిలో పడింది యూనిట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో అక్కడక్కడ స్క్రీన్ షాట్స్ తప్ప, వీడియో కనిపించడం లేదు.

కొన్ని రోజుల కిందట జిమ్ లో వ్యాయామం చేస్తున్న మహేష్ వీడియో బయటకొచ్చింది. ఆ వీడియోతో మహేష్ లుక్ మొత్తం రివీల్ అయినట్టయింది. ఈరోజు ఏకంగా షూటింగ్ సన్నివేశం లీక్ అవ్వడం యూనిట్ లో కలకలం రేపుతోంది.

ఎలాంటి లీక్స్ లేకుండా షూట్ చేయడంలో రాజమౌళి దిట్ట అంటారు. ఇలాంటివి అరికట్టడంలో అతడి ప్లానింగ్ అమోఘం అని మెచ్చుకున్నోళ్లు కూడా ఉన్నారు. కానీ మహేష్ బాబు సినిమా విషయంలో రాజమౌళి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందేమో.

7 Replies to “అయ్యో రాజమౌళి.. ఎంత పనైంది!”

  1. పిన్హోల్ కెమెరాలు అందరికీ ందుబాటు లో కి వచ్చిన ఈ రోజుల్లో , ఇలాంటివి సహజం. 100 అడ్డుకోడం కష్టం.

    ఐతే బయటకి వచ్చిన వాటిని కట్టడి చేయవచ్చు , చాలా వరకు.

    వాటికోసం మే సైబర్ సెక్యూరిటీ అనే పేరుతో కోట్ల రూపాలయ కాంట్రాక్టు లు ఇస్తారు, సినిమా వాళ్ళు.

Comments are closed.