ఓన్లీ మెగాస్టార్ డ్యూ!

ఈ బ్యాచ్‌లో మెగాస్టార్ ఒక్కరే మిస్ అయినట్లు కనిపిస్తోంది. ఆయనకు రాజ్యసభ ఫిక్స్ అనే టాక్ అయితే ఎప్పటి నుంచో ఉంది.

టాలీవుడ్‌కు రాజకీయాలకు ఏనాటి నుంచో సంబంధం ఉంది. సినిమాల్లో పైకి వచ్చిన తరువాత, లేదా రిటైర్ అయిన తరువాత మజిలీ రాజకీయాలు అని అనుకోవడం కూడా తెలుసు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఫుల్ పొలిటికల్ సీజన్ నడుస్తోంది. చాలా మంది రాజకీయంగా కీలకంగా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం‌గా ఉన్నారు.

నందమూరి నట వారసుడు బాలకృష్ణ మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. మెగా బ్రదర్ నాగబాబు లేటెస్ట్‌గా ఎమ్మెల్సీ అయ్యారు. నిర్మాత దిల్ రాజు తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్నారు. ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. ఇలా టాలీవుడ్ నలుమూలా పొలిటికల్ టచ్ కనిపిస్తోంది.

ఈ బ్యాచ్‌లో మెగాస్టార్ ఒక్కరే మిస్ అయినట్లు కనిపిస్తోంది. ఆయనకు రాజ్యసభ ఫిక్స్ అనే టాక్ అయితే ఎప్పటి నుంచో ఉంది. కళాకారుల కోటాలో మెగాస్టార్ రాజ్యసభ సభ్యుడు అవుతారని టాక్. ఇదే కనుక పూర్తి అయితే టాలీవుడ్‌కు పూర్తిగా పొలిటికల్ టచ్ వచ్చేసినట్లు అవుతుంది.

ఇదిలా ఉంటే ఏపీ మంత్రులు గొట్టిపాటి రవి, అనగాని సత్య ప్రసాద్, ఎంపీ భరత్ కూడా టాలీవుడ్ వాళ్లకిందే లెక్క. ఎందుకంటే గొట్టిపాటి రవి, అనగాని సత్య ప్రసాద్‌కు టాలీవుడ్ జనాలతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎంపీ భరత్ సాక్షాత్తూ సీనియర్ హీరో బాలకృష్ణ అల్లుడు. ఆ లెక్కన బాలయ్య మరో అల్లుడు లోకేష్ కూడా టాలీవుడ్ బంధువే.

11 Replies to “ఓన్లీ మెగాస్టార్ డ్యూ!”

  1. శ్రీ భరత్ ఇద్దరు తాత గార్లు (ఎం వి వి యస్ మూర్తి, కావూరి సాంబశివరావు) మాజీ ఎంపీ లు. ఆయన బాలకృష్ణ అల్లుడు కాకముందునుంచే వాళ్ళవి రాజకీయ నేపధ్యం వున్న కుటుంబాలు.

    1. అయ్యో ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అని మొన్నే కదా చెప్పింది మీ చిర్రు.

Comments are closed.