టీడీపీకి మూడు ఎమ్మెల్సీలే… అభ్య‌ర్థుల ఖ‌రారు!

ఎమ్మెల్యే కోటాలో కూట‌మికి ద‌క్క‌నున్న ఐదు ఎమ్మెల్సీల అభ్య‌ర్థుల‌పై ఉత్కంఠ‌కు దాదాపు తెర‌ప‌డింది.

ఎమ్మెల్యే కోటాలో కూట‌మికి ద‌క్క‌నున్న ఐదు ఎమ్మెల్సీల అభ్య‌ర్థుల‌పై ఉత్కంఠ‌కు దాదాపు తెర‌ప‌డింది. ఐదింటిలో టీడీపీకి కేవ‌లం మూడు సీట్లే ద‌క్క‌డం గ‌మ‌నార్హం.

టీడీపీకి ద‌క్క‌నున్న ఆ మూడు ఎమ్మెల్సీ సీట్ల‌కు అభ్య‌ర్థులుగా శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభాభార‌తి కుమార్తె కావ‌లి గ్రీష్మ (ఎస్సీ), నెల్లూరు జిల్లాకు చెందిన బీద ర‌విచంద్ర (బీసీ), అలాగే క‌ర్నూలు జిల్లాకు చెందిన బీటీ నాయుడు (బీసీ) పేర్ల‌ను టీడీపీ అధిష్టానం ప్ర‌క‌టించింది.

నామినేష‌న్ల దాఖ‌లుకు సోమ‌వారంతో గ‌డువు ముగియ‌నుంది. మ‌రోవైపు టీడీపీలో ఆశావ‌హులు ఎక్కువ కావ‌డంతో అభ్య‌ర్థుల ఎంపిక క‌ష్ట‌మైంది. అనేక వ‌డ‌పోత‌ల త‌ర్వాత పైన పేర్కొన్న ముగ్గురిని టీడీపీ అధిష్టానం ప్రక‌టించింది. ఇప్ప‌టికే జ‌న‌సేన నుంచి డిప్యూటీ క‌ల్యాణ్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న నాగ‌బాబు నామినేష‌న్ కూడా దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

మ‌రో సీటు త‌మ‌కు ఇవ్వాల్సిందే అని బీజేపీ ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు తెలిసింది. దీంతో ఆ పార్టీకి ఒక సీటును టీడీపీ వ‌దిలిపెట్టింది. ఐదు సీట్ల‌ను కూట‌మి పార్టీలు పంచుకున్న‌ట్టైంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీలు మాధ‌వ్‌, సోము వీర్రాజు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఇవాళ రాత్రికి బీజేపీ అభ్య‌ర్థులు ఖ‌రార‌య్యే అవ‌కాశం వుంది. ఎందుకంటే, సోమ‌వారంతో నామినేష‌న్ల గ‌డువు ముగుస్తుంది.

12 Replies to “టీడీపీకి మూడు ఎమ్మెల్సీలే… అభ్య‌ర్థుల ఖ‌రారు!”

  1. లైలా వేసిన మేకప్ చూసి మోసపోవడమే…

    పిఠాపురం వర్మగారి మెట్టు దెబ్బ లాగా

  2. Instead of Naga Babu, Jana Sena would have offered MLC seat to an honest hard working party activist. It will create a new leader in the party. Naga Babu is already enjoying the celebrity status as being a brother of deputy CM brother.

    1. Nagababu sir is a pillar of support for party. He deserves MLC and minister post. TDP has many people from the same family, why cannot Janasena have another brother getting a MLC post.

Comments are closed.