ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫెస్టివ్ మూడ్ లో ఉండవలసిన సీజనులాగా ఉన్నట్టుంది ఇప్పుడు. ఆయనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో దాఖలవుతున్న పిటిషన్లు వరుసగా వీగిపోతున్నాయి. సుప్రీంకోర్టు వాటిని కొట్టివేస్తోంది. ఒక నాయకుడికి ఇలాంటి పరిణామాల కంటె పండగ చేసుకునే సందర్భం ఇంకేముటుంది.
రెండు రోజుల కిందట.. చంద్రబాబునాయుడు మీద ప్రస్తుతం ఏపీ సీఐడీ వద్ద దర్యాప్తు పెండింగులో ఉన్న ఏడు కేసులు సీబీఐకు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ఇప్పుడు.. 2003లో ఒక లావాదేవీలో చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడ్డారంటూ పెండింగులో ఉన్న దర్యాప్తును సీబీఐకు బదిలీ చేయాలంటూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసంన తిరస్కరించింది.
నిజం చెప్పాలంటే.. ఎన్నడో ఇరవయ్యేళ్ల కిందటి వ్యవహారం అది. ఇప్పటికే మురిగిపోయిన వ్యవహారం అని అనుకోవాలి. కానీ.. మనం సాధారణంగా కానూన్ కా హాథ్ బహుత్ లంబా హై అని నమ్ముతాం. తప్పు ఎప్పుడు చేసినా సరే.. ఎన్ని దశాబ్దాల తర్వాతనైనా సరే దానికి ప్రాయశ్చిత్తం జరిగి తీరాల్సిందే అని నమ్ముతాం. అంతవరకు బాగానే ఉన్నది గానీ.. అసలు తప్పు జరిగినదో లేదో తేల్చవలసిన దర్యాప్తు సంస్థలు అడుగు ముందుకు వేయకపోతే, కాడి పక్కన పడేసి కూర్చుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అందుకే ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా సుప్రీం తిరస్కరణకు గురైనట్టు కనిపిస్తోంది.
2003లో స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేయడానికి చంద్రబాబునాయుడు ఐఎంజీ భారత్ అకాడమీస్ సంస్థతో ఒప్పందాలు చేసుకని, 400 ఎకరాలను ఎకరా రూ.50వేల వంతున అప్పట్లో అమ్మేశారు. తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ఎంఓయూ రద్దు చేశారు. ఆయన సీబీఐ విచారణకు లేఖరాశారు కానీ.. వారు ఒప్పుకోలేదు. వైఎస్సార్ సీబీసీఐడీ విచారణకు 2007లో ఆదేశించారు. ఆ విచారణ ముందుకు సాగలేదు. ఆ తర్వాత రాష్ట్రం రెండు ముక్కలైంది. ఈ విచారణ గురించి అందరూ మర్చిపోయారు.
రాష్ట్ర విభజనకు ముందే 2012లో ఈ కేసుల విచారణను సీబీఐకు బదిలీ చేయాలంటూ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్, మరో న్యాయవాది శ్రీరంగారావు విడివిడిగా హైకోర్టులో పిల్ లు వేశారు. కానీ.. హైకోర్టు వాటిని ఇటీవల.. 2024 డిసెంబరులో కొట్టేసింది. వారు స్పెషల్ లీవ్ పిటిషన్ లను సుప్రీంకోర్టులో వేశారు. తాజాగా సుప్రీం కోర్టు కూడా డిస్మిస్ చేసింది. రెండు దశాబ్దాల కిందటి నేరారోపణలకు సంబంధించి.. దర్యాప్తు సంస్థ పట్టించుకోవడం మానేసింది. సీబీఐ కు బదిలీ చేయాలని కోరుతోంటే సుప్రీం తిరస్కరించింది. చంద్రబాబునాయుడుకు ఇంతకంటె ఊరట ఏముంటుంది?
So అన్ని “ఏలేరు” లో కలిసిపోయాయి. Antega antega.
కేసు లో మెరిట్ లేకపోతె అన్ని ఇడుపులపాయలో కూడా కలిసేవి…
బహుశా తాజ్ లో సుందరమైన వాతావరణంలో డీల్ ద్వారా పున్నమిఘాట్ లోకి వెళ్లి అక్కడ నుంచీ ఏలేరు లో కలిసిపోయి ఉంటాయి
మహామేత, బోకు గాడి మీద కేసులు ఏమైనాయ్, వెకిలి వెధవని ఎన్నాళ్ళు బెయిల్ మీద ఉంచుతారు, అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు !!
As per this article, in 2004, when YSR was at the peak and in both state and centre congress was in power, why did CBI refuse to take up this case? Maybe, there is no merit in this case to take it up.
Abk Prasad inkaa bathike unnada?