టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు శివ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు గుండె పోటుకు గురయ్యారు. ప్రస్తుతం అతను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. పోస్ట్ కోవిడ్ లక్షణాలతో గుండెపోటుకు గురైనట్టు వైద్యులు చెబుతున్నారు.
ఇదిలా వుండగా చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖరరెడ్డి కుమార్తెతో ధర్మారెడ్డి కుమారుడికి వివాహ నిశ్చయమైంది. వచ్చే నెల 26న వారి పెళ్లి తిరుమలలో జరగాల్సి వుంది. ప్రస్తుతం వాళ్ల పెళ్లికి సంబంధించి పత్రికలను కూడా ఇరు వైపు కుటుంబ సభ్యులు పంచుతున్నారు. వచ్చే నెలలో వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన సమయంలో హఠాత్తుగా పెళ్లి కుమారుడు గుండె పోటుకు గురయ్యారు.
చెన్నైలో వుంటున్న శివ గుండెల్లో నొప్పి అనిపించగానే వెంటనే కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. 24 గంటలు గడిస్తే తప్ప… అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. గత మూడేళ్లుగా ధర్మారెడ్డి టీటీడీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఆయన మెలుగుతున్నారు. ధర్మారెడ్డి కుమారుడి ఆరోగ్యంపై సీఎం జగన్, వైసీపీ ముఖ్య నేతలు ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. ఎంతో జీవితం ఉన్న శివ త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం.