అందాల పోటీల్లో భారత్ మరో ఘన విజయాన్ని అందుకుంది. మిసెస్ వరల్డ్ కిరీటం ఇండియాకు దక్కింది. 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ కిరీటం ఇండియా వశమైంది. ఈ ఘనత సాధించిన వ్యక్తి సర్గమ్ కౌశల్. 63 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలను ఓడించి, మిసెస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు సర్గమ్.
జమ్ముకశ్మీర్ కు చెందిన సర్గమ్ కౌశల్, ఇంగ్లిష్ లిటరేచర్ లో పీజీ చేశారు. వైజాగ్ లో కొన్నాళ్లు ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఈమె భర్త ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాడు.
వివాహిత మహిళల కోసం అందాల పోటీల్ని 1984 నుంచి నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో ఈ పోటీల్ని మిసెస్ ఉమెన్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచేవారు. 1988 నుంచి మిసెస్ వరల్డ్ అని పిలవడం మొదలుపెట్టారు.
ఇంతకుముందు ఇండియా, ఒకేఒకసారి మిసెస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. 2001లో అదితి గోవారికర్ ఈ కిరీటం దక్కించుకుంది. మళ్లీ ఇన్నేళ్లకు సర్గమ్ కౌశల్ ఆ ఘనత సాధించారు.