తాడిపత్రికి వెళ్లేందుకు ఏపీ హైకోర్టు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతి ఇచ్చింది. అయితే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకుంది. తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డికి న్యాయదేవత వరమిచ్చినా పూజారి అయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి దయతలిస్తేనే ఏదైనా జరుగుతుందనే చర్చకు తెరలేచింది.
గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. తాడిపత్రిలో వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి తన సమీప ప్రత్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి తాడిపత్రిలో కేతిరెడ్డిని జేసీ ప్రభాకర్‌రెడ్డి అడుగు పెట్టనివ్వడం లేదు. రెండుమూడు సార్లు తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి ప్రయత్నించినప్పటికీ, పోలీసులు అడ్డుకున్నారు.
ఉద్రిక్త పరిస్థితులున్నాయని, వెళ్తే అల్లర్లు జరుగుతాయంటూ కేతిరెడ్డిని ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించారు. ఒకసారి కేతిరెడ్డి నివాసంపై టీడీపీ శ్రేణులు దాడికి కూడా పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో తనను తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ కేతిరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కేతిరెడ్డికి సానుకూల తీర్పు వచ్చింది.
కేతిరెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే కేతిరెడ్డికి న్యాయస్థానం షరతులు కూడా విధించింది. ఐదు వాహనాలకు మించి వెంట వుండకూడదనే షరతు విధించింది. ఈ నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి సిద్ధమవుతున్నారు. ముందుగా అనంతపురం ఎస్పీని కలిసి, న్యాయ స్థానంలో తనకు అనుమతి లభించిన విషయాన్ని చెప్పనున్నారు. అలాగే భద్రత కల్పించాలని కోరనున్నారు.
పోలీసుల నుంచి సానుకూల స్పందన వచ్చిన తర్వాతే తాడిపత్రికి కేతిరెడ్డి వెళ్లే అవకాశం వుంది. అయితే ఏపీ హైకోర్టు ఆదేశాల్ని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి గౌరవించి, అడ్డుపడకుండా ఉంటారా? అనే చర్చకు తెరలేచింది.
Ill intention తో, మందీ మార్భలం ఏసుకుని, రౌడీయిజం చెయ్యడానికి పోతే ఊరికే ఉంటారా?? కేతి ని కోసి కారం పెడతారు..
ఆలా కాకుండా, నార్మల్ గా పోయేవాళ్ళని, అన్నీ దారుల్లో, అన్నీ వెహికల్స్ 24/7 ఎవరూ చెక్ చేయరు.. కదా ??
.వెళ్తే చస్తాడు
What did he do when Jagan was in power. Langa batch