విశాఖలో ఐకానిక్ టవర్… సిటీ ఆఫ్ డెస్టినీకి కొత్త అందం

విశాఖ అంటేనే సిటీ ఆఫ్ డెస్టినీ. అందానికి గమ్యస్థానం. ఆనందానికి చిరునామా. ఇక్కడికి జీవితంలో ఒకసారి అయినా రావాలని ప్రతీ ఒక్కరూ భావిస్తారు. అదే టైమ్ లో విశాఖ ప్రముఖ టూరిజం స్పాట్ గా…

విశాఖ అంటేనే సిటీ ఆఫ్ డెస్టినీ. అందానికి గమ్యస్థానం. ఆనందానికి చిరునామా. ఇక్కడికి జీవితంలో ఒకసారి అయినా రావాలని ప్రతీ ఒక్కరూ భావిస్తారు. అదే టైమ్ లో విశాఖ ప్రముఖ టూరిజం స్పాట్ గా ఉంది. వీకెండ్ లో ఇక్కడ రద్దీ కూడా ఒక లెవెల్ లో ఉంటుంది. 

అలాంటి విశాఖ సిగలో మరో ఆభరణం సిద్ధం కాబోతోంది. దాని పేరే ఐకానిక్ టవర్. విశాఖ అంటే ఏమిటి. ఇలా వచ్చే ప్రశ్నకు సరైన సమాధానంగా ఈ ఐకానిక్ టవర్ నిలుస్తుంది అంటున్నారు.

విశాఖ అంటే ఒక్క మాటలో చెప్పేలా ఈ ఐకానిక్ టవర్ ఉంటుంది అని చెబుతున్నారు. ఈ మేరకు మహా విశాఖ నగర పాలక సంస్థ సన్నాహలు చేస్తోంది. విశాఖలో ఐకానిక్ టవర్ ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా తెలిపారు.

ఇప్పటికే విశాఖ ప్రాకృతిక అందాలతో పాటు, అద్భుతమైన సాగర తీరం, ఎత్తైన కొండలు, డాల్ఫిన్ నోస్, పోర్టు, షిప్ యార్డ్, స్టీల్ ప్లాంట్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఇపుడు విశాఖ అంటే ఒక్క మాటలో చెప్పేలా ఈ ఐకానిక్ టవర్ రూపకల్పన చేస్తున్నారు.

ఈ ఐకానికి టవర్ ని విశాఖ బీచ్ లో ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా విశాఖలోని ప్రసిద్ధ పర్యాటక క్షేత్రాలు, పుణ్య క్షేత్రాలు, ఇతర ముఖ్య ప్రదేశాలతో కూడిన సమాచారాన్ని అందించేలా విశాఖ దర్శిని పేరిట ఒక గైడ్ ని కూడా తొందరలోనే తీసుకువచ్చేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేస్తున్నారు.  

మొత్తానికి విశాఖ అంటే ఒక గుర్తింపు. దాన్ని రెట్టింపు చేసేలా ఐకానిక్ టవర్ టూరిస్టులను ఇక మీదట  అలరిస్తుందని భావిస్తున్నారు.