పురుషుల కోసం చట్టాలుంటే చనిపోయేవాడిని కాదు..!

భార్య, అత్తింటివారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఓ ఇంజినీర్​ సెల్ఫీ వీడియోలోని ఆవేదన ఇది.

భార్య, అత్తింటివారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఓ ఇంజినీర్​ సెల్ఫీ వీడియోలోని ఆవేదన ఇది. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన తల్లిదండ్రులకు పంపిన వీడియో ఇది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ ఇంజనీర్​వయసు 33 ఏళ్లు మాత్రమే. దేశంలో ఈమధ్య కాలంలో భార్యల వేధింపులను తట్టుకోలేక, భరించలేక ఎంతోమంది భర్తలు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ఆత్మహత్య చేసుకుంటున్నవారు తాము పడిన వేధింపులను, బాధను, నిస్సహాయతను సూసైడ్​ నోట్​ రూపంలోనో, వీడియోల రూపంలోనో తెలియచేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో ఎక్కువమంది ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఉంటున్నారు. కాని వారు భార్యలు, అత్తింటివారు పెట్టే వేధింపులను తట్టుకోలేకపోతున్నారు. కారణం…భర్తలు తమను తాము రక్షించుకోవడానికి చట్టాలు లేవు. భర్తల రక్షణకూ చట్టాలు చేయాలని డిమాండ్​ చేస్తూ ఇటీవల ఢిల్లీలోని జంతర్​మంతర్​వద్ద భారీ ధర్నా జరిగిన సంగతి తెలిసిందే.

ఇక…ప్రస్తుతం ఇంజినీర్​ ఆత్మహత్య ఘటన విషయానికొస్తే…ఆస్తి రాసివ్వకపోతే వరకట్న వేధింపుల కేసు పెడతామని భార్య, అత్తింటివారు మోహిత్​యాదవ్​ అనే ఇంజినీర్​ను వేధించారు. ఈ ఘటన యూపీలోని ఇటావాలో జరిగింది. వేధింపులు తట్టుకోలేని ఆ యువ ఇంజినీర్​ హోటల్​ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని భార్య పేరు ప్రియ. ఆమె, ఇతను ఏడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అయినప్పటికీ భార్య, అత్తింటివారు కలిసి తన ఆస్తి రాసివ్వాలని వేధిస్తున్నారని మోహిత్​ తన తల్లిదండ్రులకు పంపిన పంపిన వీడియోలో చెప్పాడు. అత్తగారు వాళ్లు తన భార్యకు అబార్షన్​ కూడా చేయించారని చెప్పాడు. భార్య తండ్రి అల్లుడి మీద తప్పుడు కేసు కూడా పెట్టాడు. చంపేస్తామంటూ బావమరిది బెదిరించాడు. ఇలా వివిధ రకాలుగా వేధింపులు అధికం కావడంతో తాను తట్టుకోలేకపోతున్నానని వీడియోలో చెప్పాడు.

ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తనను క్షమించాలని తల్లదండ్రులను వేడుకున్నాడు. చావు తరువాత కూడా తనకు న్యాయం జరగకపోతే తన అస్తికలను మురుగు కాలువలో కలపాలని కోరాడు. ‘పురుషుల కోసమే చట్టాలుంటే నేను ఆత్మ హత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకునేవాడిని కాదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. దేశంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి.

7 Replies to “పురుషుల కోసం చట్టాలుంటే చనిపోయేవాడిని కాదు..!”

  1. గు ప కొట్టకుండా నువ్వేం మగాడివి…చదివితే సరిపోదు…life లో దమ్ము ధైర్యం ఉండాలి…

    1. తప్పు బ్రో. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక అతని పరిస్థితి ఏంటో మనకి తెలియదు కదా. 

      1. నన్నూ చాలా మంది attack try చేసారు….cell cam తో video తీసి si కి forward చేశా….matter settled…techie ayyundi అదీ cheyaledaa…parents కి పుత్ర శోకం migilchaadu….advicing all on this platform…ఎవరు తేడా గా behave చేసినా video teeyinchandi secret గా….police కి forward చేస్తే opp team closed 

Comments are closed.