వాయిదా వేస్తారు.. సైలెంట్ అవుతారు

విడుదల తేదీపై సరైన స్పష్టత లేకపోవడంతోనే ఇలా చాలా సినిమాలు సైలెంట్ అవుతున్నాయి.

ఇదిగో వస్తున్నాం, అదిగో వస్తున్నామంటూ హడావిడి చేశాయి. గ్లింప్స్, పోస్టర్లతో హంగామా చేశాయి. అంతలోనే సడెన్ గా సైలెంట్ అయ్యాయి. ఈమధ్య కాలంలో ఇలాంటి సినిమాలు ఎక్కువయ్యాయి.

ఉదాహరణకు ఘాటీ సినిమానే తీసుకుంటే, అనుష్క లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తామన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి సినిమా విడుదలై ఫస్ట్ వీకెండ్ ముగియాలి. కానీ సినిమా వాయిదా పడింది.

ఘాటీ వాయిదా పడిందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మరో విడుదల తేదీని ప్రకటించకుండా పూర్తిగా సైలెంట్ అవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ అంటేనే అన్ ప్రెడిక్టబుల్ అంటున్నారు జనం.

మరో సినిమా రాజాసాబ్ ది కూడా ఇదే పరిస్థితి. గ్లింప్స్ రిలీజ్ చేశారు, విడుదల తేదీ కూడా చెప్పారు. టీజర్ కూడా రెడీ అన్నారు. అంతలోనే అందరూ గప్ చుప్. టీజర్ ఏమైందో తెలీదు, రిలీజ్ ఎప్పుడో తెలీదు.

హరిహర వీరమల్లు సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమా ఎన్నిసార్లు వాయిదా పడిందో మేకర్స్ కు కూడా గుర్తులేదు. ఈసారి రిలీజ్ పక్కా అన్నారు. ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు. అంతలోనే మరోసారి వాయిదా వేశారు. ప్రస్తుతానికి అంతా సైలెంట్ అయ్యారు.

కింగ్ డమ్ విషయంలో కూడా ఈమధ్య అదే జరిగింది. టైటిల్ గ్లింప్స్ తో, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఓ ఊపు వచ్చింది. ఆ ఊపును అలానే కొనసాగించి ఉంటే బాగుండేది. గ్యాప్ ఇచ్చారు. ఒకటే నిశ్శబ్దం. దీంతో విడుదలపై అనుమానాలు. తాజాగా నాగవంశీ ప్రకటనతో కాస్త సర్దుకుంది.

విడుదల తేదీపై సరైన స్పష్టత లేకపోవడంతోనే ఇలా చాలా సినిమాలు సైలెంట్ అవుతున్నాయి. డేట్ లాక్ అయిన తర్వాత అప్పుడు ప్రచారం సంగతి చూసుకుందాం అన్నట్టున్నాయి ప్రొడక్షన్ కంపెనీలు.

2 Replies to “వాయిదా వేస్తారు.. సైలెంట్ అవుతారు”

  1. సినిమా లో దమ్ము ఉంటే… ఎప్పుడు వొస్తే ఏమిటి G A?? సినిమా చూసామా, రివ్యూ ఇచ్చామా అని మాత్రమే ఆలోచించు 

  2. Pavan. చాలా unprofessional గా ఉన్నాడు.   డబ్బు కోసం సినిమా లు చేసేసి. ఇప్పుడు ఇలా నిర్మాతలను ముంచడం. ఇదేం న్యాయం  ఒక్క వారం కాల్షీట్ లు ఇస్తే అయిపోయేదానికి ఇలా చెయ్యడం సమంజసం కాదు కదా

Comments are closed.