స్టేట్ మెంట్ ఓకే.. ప్రాక్టికల్ గా సాధ్యమా?

తను మరో పదేళ్ల పాటు సినిమాలు చేస్తానంటోంది హెబ్బా. దీంతో జనం అబ్బా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

కొన్ని ప్రకటనలు ఆసక్తికరంగా ఉంటాయి. మరికొన్ని ప్రకటనలు వింటే మాత్రం అతిశయోక్తి అనిపిస్తుంది. హెబ్బా పటేల్ ఇచ్చిన తాజా స్టేట్ మెంట్ రెండో కోవకు చెందుతుంది. తను మరో పదేళ్ల పాటు సినిమాలు చేస్తానంటోంది హెబ్బా. దీంతో జనం అబ్బా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

హెబ్బా హవా ముగిసి చాలా ఏళ్లయింది. ఆమె సాలిడ్ హిట్ కొట్టి చాన్నాళ్లయింది. తాజాగా ఓదెల-2 వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర అది పెద్దగా ప్రభావం చూపించలేదు కానీ వచ్చిన కొద్దోగొప్పో క్రెడిట్ ను తమన్నా ఎగరేసుకుపోయింది.

ఇలాంటి టైమ్ లో హెబ్బా ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. మరో పదేళ్ల పాటు తన కెరీర్ కొనసాగుతుందనేది ఆమె మాట. అసలే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ఆ లెక్కన చూసుకుంటే, పదేళ్ల పాటు బాగానే బండి లాక్కొచ్చింది హెబ్బా. ‘ఇంకో పదేళ్లు ఉంటా’ అంటూ ఆమె చెప్పడం మాత్రం కాస్త ఓవర్ అనిపిస్తోంది.

పరిశ్రమలో కొనసాగాలంటే ఒకటే ప్రాతిపదిక. సక్సెస్ ఉన్నోళ్లే ఇక్కడుంటారు. మిగతావాళ్లు ఫేడవుట్ అవుతుంటారు. ఇది నిరంతర ప్రక్రియ. 37 ఏళ్ల హెబ్బా ఈ ప్రక్రియ నుంచి తప్పుకొని చాన్నాళ్లయింది.

One Reply to “స్టేట్ మెంట్ ఓకే.. ప్రాక్టికల్ గా సాధ్యమా?”

Comments are closed.