ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత.. అవతలి వారిని మనం ఏ విషయంలో నమ్మించాలని అనుకుంటే.. దానికి తగ్గట్టుగా ఒరిజినల్ కే ఒరిజినల్ లాగా అనిపించే నకిలీ వీడియోలను ఫ్యాబ్రికేట్ చేయవచ్చు. ఫైనల్ గా మనం ఆశించే ప్రయోజనం పొందవచ్చు. ఇవన్నీ టెక్నికల్ వ్యవహారాలు. కానీ.. ఆధునిక రాజకీయ జమానాలో.. సాక్షులను, వ్యవహారాలను కూడా ఫ్యాబ్రికేట్ చేసేస్తున్నారు. ఇంకా సూటిగా చెప్పాలంటే.. తమ రాజకీయ ప్రత్యర్థులు చేసిన నేరాలు, వారి మీద కేసులను కూడా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. తాము ముందుగా ఏం ఫలితం ఆశిస్తున్నామో డిసైడ్ అయి.. ఆ డిజైన్ ప్రకారం.. రివర్స్ స్క్రీన్ ప్లేలో అవసరమైన అన్నింటినీ ఫ్యాబ్రికేట్ చేయడం ఫ్యాషన్ అవుతోందా? అనే అనుమానం కలుగుతోంది.
అంటే.. ఈ సాక్ష్యాలను, సర్టిఫికెట్లను, అవి చెప్పగల మనుషులను.. అందరినీ, అన్నింటినీ తయారు చేయాలి! కృత్రిమ మేథ (ఏఐ) చేసే ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ కావు ఇవి! అంతకు మించిన ‘కూటమి మేథ’ ఫ్యాబ్రికేట్ చేసే హ్యూమన్ ఫ్యాబ్రికేషన్స్. పాత రాజకీయ సిద్ధాంతానికి కూటమి ప్రభుత్వం జోడిస్తున్న ఆధునిక విప్లవం గురించిన కథనమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ఎన్డీయే కూటమి సమర్పించు ఫ్యాబ్రికేషన్ వర్క్స్’!
డయాగ్రిడ్ ఫ్యాబ్రికేషన్ అనే విధానం ఒకటి నిర్మాణరంగంలో ఉంటుంది. నిర్మాణానికి సంబంధించిన ఫైనల్ డిజైన్ ను చాలా పక్కా కంప్యూటరైజ్డ్ కొలతలతో ముందే తయారుచేసేస్తారు. ఆ డిజైన్ ప్రకారం.. ఏమాత్రం తేడాలు లేకుండా ఉక్కు దూలాలను పక్కాగా ఫ్యాబ్రికేట్ చేస్తారు. మామూలు నిర్మాణాల్లో నిలువుగా పిల్లర్లు, అడ్డంగా బీమ్ లు వేస్తూ నిర్మాణం సాగించినట్లే.. ఈ విధానంలో డయాగోనల్‌గా (అయిమూలగా) ఉక్కుదూలాలను అమర్చి స్కెలిటన్ నిర్మాణం పూర్తిచేస్తారు.
ఇలాంటి డయాగోనల్ దూలాల వల్ల.. నిర్మాణం మరింత గట్టిగా పటిష్టంగా ఉంటుందని అంటారు. అంతా పక్కా కొలతలతో ముందే ఫ్యాబ్రికేట్ అవుతాయి కాబట్టి.. పని చాలా త్వరగా నాణ్యంగా పూర్తవుతుంది. వీటి నాణ్యత సీక్రెట్ మొత్తం ఫ్యాబ్రికేషన్ లోనే ఉంటుంది. ఇప్పుడు 47 అంతస్తులు, 39 అంతస్తులతో అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయానికి ఐకానిక్ టవర్లు అయిదూ ఈ డయాగ్రిడ్ పద్ధతిలోనే నిర్మాణం అవుతున్నాయి. వీటి డిజైన్లను తయారుచేయించడంలో వచ్చిన అనన్యమైన అవగాహన.. రాజకీయ పరిణామాలలో సైతం ఇదే బాటను అనుసరించేలా కూటమి పెద్దలను ప్రేరేపిస్తున్నట్టుగా ఉంది. వారు వేస్తున్న అడుగులే అందుకు నిదర్శనం.
‘ఒక కుక్కను చంపదలచుకుంటే.. ముందుగా అది పిచ్చిది అనే ముద్రవేయాలి’ చాలా పాచిపోయిన పాత సిద్ధాంతం ఇది. తమ ప్రత్యర్థులను భ్రష్టుపట్టించడంలో అనాదిగా రాజకీయ నాయకులు అనుసరిస్తూ వస్తున్న సిద్ధాంతం కూడా. కానీ, ‘ఆ కుక్క పిచ్చిది’ అని ముద్ర వేయడం ఎలాగ? ఈ ప్రక్రియ మనకు మన రాజకీయ కుటిల వేదాలు అంత విపులంగా చెప్పలేదు.
ఆ కుక్క ఎన్నడో.. ఎక్కడో.. ఎవరినో (అన్నీ సందిగ్ధార్థకాలే) కరిచిందని తొలుత ప్రచారం చేయాలి! కరవబడిన వాడిని చూసిన డాక్టరు.. పిచ్చి కుక్క కరచినట్లు నిర్ధారించారని డాక్టరు సర్టిఫికెటు పుట్టించాలి. కుక్క కరుస్తుండగా చూసిన సాక్షులు తయారు కావాలి. కుక్కకు వైద్య పరీక్షలు చేసినట్టుగా.. దానికి పిచ్చి వున్నట్టుగా మరో వెటర్నరీ డాక్టరు సర్టిఫికెట్ కావాలి. ఆ తర్వాత దానిని చంపేయాలి. అప్పుడు ప్రజలు ఆ సాక్ష్యాలన్నీ చూసి నోరెత్తకుండా ఉంటారు. మంచి పనే జరిగిందని హర్షం వ్యక్తం చేసినా కూడా ఆశ్చర్యం లేదు.
ఈ ధోరణి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసింది. రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి సరికొత్త విధానంగా దీనిని కనుగొంటున్నారు. ప్రత్యర్థుల్ని వేధించడానికి ఎలాంటి కేసులు పెట్టాలి? అనేది ముందే నిర్ణయం అయిపోయి ఉంటుంది. ఏ ప్రాతిపదిక మీద ఆ నిర్ణయం తీసుకున్నారనేది చాలా చిత్రంగా ఉంటుంది. ఆ ప్రత్యర్థుల మీద తాము గతంలో ఎలాంటి ఆరోపణలు చేశారో.. అవే పునాదిగా కేసులు పెట్టాలనేది వ్యూహం! అలా చేయకపోతే.. తాము చేసిన ఆరోపణలన్నీ పొల్లు మాటలే అని తెలిసిపోతే.. పరువు పోతుంది కదా అనేది భయం! కాబట్టి ముందు కేసులు డిసైడై.. వాటి నిరూపణకు చూపించగల ఆధారాల్ని, చెప్పగల మనుషుల్ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. ఇది అసలు సిసలు తప్పుడు పద్ధతి.
లిక్కర్ స్కామ్.. ఓ ఉదాహరణ!
జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో సంధించిన ప్రధాన అస్త్రాలలో మద్యం కుంభకోణం కూడా ఒకటి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త లిక్కర్ పాలసీని తీసుకువచ్చారు. ప్రైవేటు రంగంలో లిక్కర్ దుకాణాలు ఉండటం వలన ఈ వ్యాపారంలో ఉండే భారీ లాభాలు ప్రైవేటు వ్యక్తుల పరం అవుతున్నాయనే అభిప్రాయంతో పాటు, అధికారులు కళ్ళుగప్పి సాగే బెల్ట్ షాపుల వ్యవహారాలు గ్రామీణ జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆయన భావించారు.
ఇలాంటి అన్ని దుర్మార్గాలకు విరుగుడుగా ప్రభుత్వ దుకాణాలను తీసుకువచ్చారు. దీనివలన మద్యం విక్రయాలలో పారదర్శకత కూడా పెరుగుతుందని ఆయన నమ్మారు. అయితే ఈ విధానంలో భారీగా దోపిడీకి పాల్పడినట్లు కూటమి పార్టీలు గతంలో ఆరోపించాయి.
ఎన్నికల సమయంలో లిక్కర్ కుంభకోణం పేరుతో అనేక అభూత కల్పనలను ప్రచారం చేశాయి. జగన్మోహన్ రెడ్డి ఏకంగా 30 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని తెలుగుదేశం, జనసేన తదితరులు ఆరోపిస్తే.. భారతీయ జనతా పార్టీ సారథి పురందేశ్వరి ఇంకాస్త అత్యుత్సాహంతో టిడిపి గణాంకాలు తప్పు అని జగన్ లిక్కర్ స్కామ్‌లో 50 వేల కోట్ల రూపాయలు దిగిమింగారని ఆరోపణలు చేశారు. మొత్తానికి కూటమి ఎన్నికల్లో నెగ్గింది. అధికారంలోకి వచ్చింది.
లిక్కర్ స్కాం గురించి దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాన్ని కూడా సిట్ రూపంలో ఏర్పాటు చేసింది. వీరు కొన్ని నెలల కసరత్తు తర్వాత తేల్చినది ఏమిటంటే.. 3000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని. అది కూడా వారి ప్రాథమిక అంచనా మాత్రమే. అనుమానితులను, నిందితులను విచారించడం మొత్తం పూర్తయ్యాక ఈ మొత్తం తగ్గవచ్చు– పెరగవచ్చు. ఈ గణాంకాల వరకు చూస్తేనే ఎన్నికల సమయంలో అబద్ధాలను ప్రచారం చేసి కూటమి పార్టీలు గెలుపొందినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు.
కనీసం ఈ మూడు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వైసీపీ పెద్దలే దిగమింగారని నిరూపించడం ప్రభుత్వానికి ఒక అత్యవసరమైన విషయంగా మారింది. చూపించలేకపోతే వాడి విశ్వసనీయత ప్రజల దృష్టిలో పతనం అవుతుంది. దానికి తగ్గట్టుగా వారు ఇతర వ్యవహారాలను ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ వ్యాపారం రూపంలో జరిగిన అవినీతికి ప్రధాన సూత్రధారి అని తేల్చిన తర్వాత ఆయనను విచారించడంలో లేదా అరెస్టు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది.
తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరత్రా హడావుడి చేయడం ఎక్కువైంది. ఆల్రెడీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ కుంభకోణానికి సమస్తం అని స్పష్టంగా ఆరోపించిన విజయసాయి నే మళ్లీ విచారణకు పిలవడం ఒక వింత. పిలిచి గతంలో చెప్పిన విషయాన్నే మళ్లీ చెప్పించుకున్నారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉన్న ఆ పార్టీ మీద ధ్వజమెత్తుతున్న విజయసాయిరెడ్డి తో తమకు అవసరమైన విధంగా సాక్ష్యాలు చెప్పించుకోవచ్చునని, ఆధారాలను ఫ్యాబ్రికేట్ చేయవచ్చునని కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంటుందనే అనుమానం ప్రజల్లో కలుగుతుంది.
ఈ పది నెలల పదవీకాలంలో ఇది తొలిసారి కాదు. సౌర విద్యుత్తు కోసం జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గా సంస్థ అయిన సెకి తో ఒప్పందాలు చేసుకుంటే.. అదానీ నుంచి ముడుపులు తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. వారు ఆరోపించిన ఒక్కటంటే ఒక్క విషయాన్ని కూడా నిరూపించలేకపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలలో అనుమానాలను రేకెత్తించడంలో మాత్రం సఫలమయ్యారు. ఈ వ్యవహారంలో కూడా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడగల వ్యక్తులను వారు ఫ్యాబ్రికేట్ చేశారని అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే జగన్ మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటికే పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆయన ద్వారా జరిగిన ఒప్పందాలన్నీ అవినీతిమయమైనవే అనే అనుమానం ప్రజలకు కలిగేలాగా మాట్లాడించారు.
ప్రజలలో జగన్ పరువు పోయిన తర్వాత ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. అవినీతి జరిగిందనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నమ్మితే గనుక అప్పటికే గడువు ప్రకారం విద్యుత్తు సరఫరా చేయలేకపోయిన సంస్థతో ఒప్పందాలను రద్దు చేసుకోవచ్చు కదా. ఆ పని మాత్రం చేయలేదు. బాలినేని శ్రీనివాస్ రెడ్డిని జగన్ మీదకు ప్రయోగించగల ఒక అస్త్రం లాగా వారు ఫ్యాబ్రికేట్ చేశారు.
ఇంకా ప్రమాదాలు పొంచి ఉన్నాయా
వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రజలు భయపడేలాగా ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు పలికిన అసత్యాలు ఇంకా అనేకం ఉన్నాయి. ప్రత్యేకించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. జగన్ సర్కారు క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించడానికి తీసుకు వచ్చిన వ్యవస్థలోని వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ అనైతికమైన, నీతిబాహ్యమైన తీవ్ర ఆరోపణలు చేశారు.
విమెన్ ట్రాఫికింగ్ ను వైసీపీ నేతలు వాలంటీర్ల ద్వారా నడిపిస్తున్నారనే ఆరోపణలు మొత్తం రాష్ట్రాన్ని కుదిపేశాయి. పవన్ కళ్యాణ్ పదే పదే అదే ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తోంది. అంత తీవ్రమైన అంశాన్ని ఎందుకు అంత వెంటనే మరచిపోయారు. తాను చేసిన ఆరోపణలు నిజమే అయితే గనుక ఇప్పుడు దర్యాప్తుకు ఆదేశించి సంగతి తేల్చాలి కదా. లేకపోతే ఆయన అబద్ధాలతో ప్రజలను మోసం చేసినట్లు అనుకోవాలి కదా.
ఇలాంటి ఆలోచన పవన్ కళ్యాణ్ కి గనుక వచ్చిన నాడు దీనికి అనుగుణమైన కేసులు పెట్టించి దానికి తగ్గట్లుగా అవసరమైన ఆధారాలను సాక్ష్యాలను ఫ్యాబ్రికేట్ చేయిస్తారేమో అనే భయం కూడా పలువురిలో ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా ఉన్న అనేక మంది నాయకులు ఇప్పుడు బయటకు వస్తున్నారు. వారంతా ప్రలోభాలకే లొంగుతున్నారో.. బెదిరింపులకు భయపడుతున్నారో తర్వాత సంగతి.
కానీ ఇలాంటి ఫ్యాబ్రికేషన్ పరిపాలన శృతి మించితే ఇదే తరహాలో వైసీపీ నుంచి బయటకు వచ్చే వారందరినీ ప్రలోభ పెట్టి జగన్ మీదకు సంధించే బ్రహ్మాస్త్రాలుగా అధికార కూటమి మార్చుకునే అవకాశం ఉంది. కానీ ఇలాంటి కుట్రలు కుయుక్తుల వలన రాజకీయ సామాజిక వాతావరణం విచ్ఛిన్నం అవుతుంది.
పాలకులు ఈ సంగతి గుర్తు పెట్టుకోవాలి..
ప్రత్యర్థులను వేధించడానికి ఇప్పుడున్న పాలకులు ఎలాంటి కొత్త పద్ధతులు కనిపెడుతుంటారో.. అవి కేవలం విత్తనాలు అని మాత్రమే పరిగణించాలి. అధికారం చంచలమైనది. ఎవ్వరి చేతిలోనూ శాశ్వతంగా ఉండిపోదు. ఇప్పుడు వేధింపులకు గురవుతున్న పార్టీ ఏదో ఒకనాటికి అధికారంలోకి రావడం అంటూ జరిగితే.. ఇప్పటి పాలకులు విత్తిన విత్తనాలు.. అప్పటికి మహావృక్షాలుగా ఎదిగి ఉంటాయి. ఈ తరహా ఫ్యాబ్రికేషన్ లతో వేధించడం అనేది అప్పటికి విశ్వరూపం దాలుస్తుంది. ఈ ఫ్యాబ్రికేషన్ విధానం అప్పటికి ఎలాంటి రూపంలో ఉంటుందో.. ఆ ప్రకారమే అప్పటి ప్రభుత్వాలు.. తమ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం ప్రారంభిస్తాయి.
నిజంగా నేరం జరిగిన సందర్భాలుంటే వాటిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. అయితే ఏ క్రమంలో విచారణ జరగాలో ఆ ప్రకారమే వెళ్లాలి. నేరనిరూపణ త్వరగా చేయడానికి, లేదా నేరాన్ని మరింతగా భూతద్దంలో చూపించడానికి కొత్త అంశాలను ఫ్యాబ్రికేట్ చేసే జోలికెళ్లకుండా ఉంటే చాలు. ప్రజలకు అలాంటి పాలకుల మీద విశ్వాసం కలుగుతుంది. గౌరవం కూడా పెరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న అయిదేళ్లూ సంక్షేమ పథకాలు మాత్రమే పరిపాలన అనుకున్నారు. ప్రజలకు ఆర్థికంగా దన్నుగా నిలుస్తూ, బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి డబ్బులు వేసేస్తుంటే చాలునని అనుకున్నారు.
చంద్రబాబునాయుడు సీఎం అయిన తర్వాత.. పనులు చేయడం ఒక్కటే పరిపాలన అనుకుంటున్నారు. పింఛను పెంచడం తప్ప.. హామీలేవీ నిర్దిష్టంగా కార్యరూపం దాల్చడం లేదు. ఆయన పట్టించుకోవడం లేదు. అమరావతి అని, పోలవరం అని, విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, మెట్రో ఇలా రకరకాల మాటలు చెబుతున్నాం కదా.. చేపడుతున్నాం కదా అవి చాలు అని ఆయన భ్రమలో ఉన్నారు. ప్రజలు తెలివైన వాళ్లు.. జగన్ సంక్షేమమార్గాన్నీ వారు ఇష్టపడతారు.. చంద్రబాబు పనుల మార్గాన్ని కూడా ఇష్టపడతారు. వీటన్నింటినీ మించి వారికి ఆగ్రహం తెప్పించే కారణాలు వేరే ఉంటాయి. ముఖ్యంగా పాలకులు నిజాయితీగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు.
రాజకీయ వైషమ్యాలు ముదురుతూ సామాజిక వాతావరణం సర్వనాశనం అయిపోవడాన్ని ఎవ్వరూ హర్షించరు. రాజకీయ కుట్రలు కుత్సితాలు మితిమీరుతూ ఉంటే.. అలాంటి పార్టీ సంక్షేమం+ పనులు రెండూ అద్భుతంగా చేసినా కూడా.. ప్రజలు వారిని అసహ్యించుకోగలరు. ఈ సంగతి పాలకులు గుర్తు పెట్టుకుంటే.. భవిష్యత్తు కొంచెం ఆశాజనకంగా ఉంటుంది.
..ఎల్. విజయలక్ష్మి
G బలిసిందా, మా అన్నానే కుక్క అని అంటున్నావ్.
Entha chesi oka idiot oka psycho 100 years bratukutara??
Ku kka jaglak correct peru pettav GA .!! really appreciated.
Skill kase fabricated kaadha?
kj lk l 11 pen.. tina l vl .
ఈడిని అరెస్ట్ చేసి విచారించి … అది ఎలా కుంభకోణం కాదో చెప్పెదాకా కుమ్మేయాలి.
URSA
కనీసం ఆఫీస్ , ఇమెయిల్ అడ్రస్ లేని కంపెనీ కి 60 acres ఇవ్వడం అనేది స్కాం కాక ఇంకేటి?
అంటే 3000 కోట్లు నీకు పెద్ద అవినీతి కాదన్నమాట… L వేషాలు రాతలు రాయకు నీ ఇంటి పేరులో ఉన్నట్టు…ముందు నిన్ను మూసెయ్యాలి.. బో….కు L
G బలిసిందా, మా అన్నానే కుక్క అని అంటున్నావ్.
Asalu-liquor-mottham-cash-only-payments-yenduku-pettaru?
Bubblegum article….
అక్కోయ్…నిండారోపణలు చేస్తున్నా నిరూపణ అలస్యమై మళ్ళీ ఎన్నికలొచ్చేస్తు నాయి అని భయపడుతున్నావా..
2019 election ముందు పింక్ డైమండ్, నారాసుర రక్త చరిత్ర, 30 మంది కమ్మ DSP lu, kodi kathi ఇవ్వని ఏంటి. వీటి గురించి ఎప్పుడైనా రాసావా. సరే కానీ 3000 కోట్లు నీకు పెద్ద అమౌంట్ కాదా.
world runs around wine, woman and psex. Politics runs around liquor, money, cast/religion and power.
మమతలొలికే స్వాతిముత్యం ..