విశాఖ గురించి ఈ మధ్య దాకా టీడీపీ ఒకటే ప్రచారం చేస్తూ వచ్చింది. విశాఖను విధ్వంసం చేస్తోంది వైసీపీ, తాను స్వర్గధామం చేశామని చెప్పుకుంటూ పోతోంది. అయితే జగన్ దావోస్ ట్రిప్ తరువాత చకచకా పరిణామాలు మారాయి. అందునా మూడేళ్ళుగా వైసీపీ మీద టీడీపీ అదే పనిగా టార్గెట్ చేసి మరీ హాట్ కామెంట్స్ చేస్తున్న నేపధ్యంలో ఇన్ఫోసిస్ విశాఖలో ల్యాండ్ అవడం అన్నది చాలా కీలక పరిణామం అని అంటున్నారు.
తాజాగా మంత్రి గుడివాడ అమరనాధ్ తో ఇన్ఫోసిస్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆగస్ట్ నెలలో ఇన్ఫోసిస్ విశాఖలో తన కార్యకలాపాలు మొదలెడుతుంది అని ఈ సందర్భంగా ప్రతినిధులు చెప్పినట్లుగా తెలుస్తోంది. మొదట వేయి మందికి ఉపాధి కల్పించేలా యాక్టివిటీని స్టార్ట్ చేసి మూడు వేల మంది దాకా ఇన్ఫోసిస్ ద్వారా ఉపాధి అందించేందుకు సంస్థ ముందుకు వస్తోంది.
ఇది శుభ పరిణామని విశాఖకు ఐటీ రంగానికి బూస్టింగ్ ఇచ్చే అంశమని మంత్రి గుడివాడ అంటున్నారు. అలాగే ఒక్కసారిగా వైసీపీ ఇమేజ్ ని విశాఖలో మార్చేసే విషయంగా కూడా ఆ పార్టీ నేతలు చూస్తున్నారు.
ఇన్ఫోసిస్ విశాఖలో తన సంస్థను ఏర్పాటు చేస్తుంది అన్న ప్రకటన తరువాత విశాఖ టూర్ చేసిన చంద్రబాబు ఎక్కడా ఆ మాటను ప్రస్థావించకపోవడాన్ని కూడా వైసీపీ నేతలు గుర్తు చేస్తూ తాము చేస్తున్న అభివృద్ధి చూడకుండా కేవలం విమర్శలు చేయడమే టీడీపీకి చెల్లింది అని అంటున్నారు.