జగన్ హయాంలో పరిశ్రమలు రాలేదు అని అంతా విమర్శలు చేస్తూ ఉంటారు. ఉన్న పరిశ్రమలు తరలిపోయాయని మరో అభియోగం కూడా దాని వెంటనే మోపుతారు. అయితే జగన్ 2019 మే 31న ప్రమాణం చేశారు. అదే ఏడాది నవంబర్ లో జపాన్ కి చెందిన యకహోమా అలయెన్స్ టైర్ల కంపెనీతో జగన్ సర్కార్ ఒప్పందం చేసుకుంది.
ఆ తరువాత ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం లో ఈ భారీ పరిశ్రమ ఏర్పాటైంది. గట్టిగా మూడేళ్ళు నిండకుండానే తొలిదశ పనులు పూర్తి చేసుకోవడం ఒక రికార్డుగా చూడాలి. ఈ కంపెనీని 2,353 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. ఇపుడు ఉత్పత్తి కూడా ప్రారంభం కావడం అంటే శభాష్ అనుకోవాలి.
ఇక్కడ తయారు చేసే టైర్లను ప్రపంచంలోని 120 దేశాలకు ఎగుమతి చేస్తారు. ఇదిలా ఉంటే త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అచ్యుతాపురం వచ్చి ఈ పరిశ్రమను లాంచనంగా ప్రారంభిస్తారు.
చకచకా తొలి దశ పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తి దిశగా అడుగులు వేయడం వెనక ప్రభుత్వ సహకారం ఎంతైనా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలియచేశారు. జగన్ ఏలుబడిలో ఒక భారీ పరిశ్రమ మూడేళ్ల లోపునే ఉత్పత్తికి కూడా సిద్ధం కావడం అంటే గ్రేటే అంటున్నారు.