పాదయాత్ర కంటే ముందే జగన్…?

ఏపీలో మళ్లీ రాజధాని రగడ స్టార్ట్ అయింది. ఈ నెల 12న అమరావతి టూ అరసవెల్లి అంటూ ఉత్తరాంధ్రా జిల్లాల మీదుగా అమరావతి రైతుల యాత్ర సాగనుంది. ఈ యాత్ర నవంబర్ 11కి అరసవెల్లిలో…

ఏపీలో మళ్లీ రాజధాని రగడ స్టార్ట్ అయింది. ఈ నెల 12న అమరావతి టూ అరసవెల్లి అంటూ ఉత్తరాంధ్రా జిల్లాల మీదుగా అమరావతి రైతుల యాత్ర సాగనుంది. ఈ యాత్ర నవంబర్ 11కి అరసవెల్లిలో ముగుస్తుంది. అరవై రోజుల పాటు ఏపీలో రాజకీయ వేడి రాజధాని మీద వాడి అయిన చర్చలు ఉంటాయి.

ఇక విశాఖ పరిపాలనా రాజధాని అని ఇప్పటికే వైసీపీ మంత్రులు చెబుతున్నారు. తొందరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా దానికి సంబంధించి బిల్లు ప్రవేశపెడతారు. ఆ తరువాత ఏ క్షణం లో అయిన ముఖ్యమంత్రి జగన్ తన మకాం విశాఖ మారుస్తారు అని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

న్యాయపరమైన అడ్డంకులు లేకుండా జగన్ తమ క్యాంప్ ఆఫీస్ ని విశాఖలో ఏర్పాటు చేసుకుని పాలన సాగిస్తారు అని తెలుస్తోంది. అమరావతిలోనే సచివాలయం ఉంటుంది. దాన్ని ఇప్పట్లో తరలించడం కష్టమన్న భావనతో ముందే ముఖ్యమంత్రి వస్తారని అంటున్నారు.

ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ విశాఖలోని సాగరనగర్ ప్రాంతంలో  రుషికొండ దగ్గర ఉంటుందని చెబుతున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని అంటున్నారు. ముఖ్య‌మంత్రి జగన్ విశాఖ వచ్చి క్యాంప్ ఆఫీస్ ఓపేన్ చేశాకనే రాజధాని రైతుల పాదయాత్ర విశాఖలో ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. అంటే మూడు రాజధానులకు ముందే వైసీపీ కొబ్బరికాయ కొట్టేస్తుంది అని చెబుతున్నారు.