తెలుగుదేశం వారి ‘పచ్చి బూతుల పోటీలు’

అన్నగారు ఎన్.టి.ఆర్ ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం స్థాపిస్తే ఈరోజు ఆ పార్టీని బూతుల పోటీల వేదికగా మార్చిన ఘనత పచ్చమీడియాదే.  Advertisement వైకాపా నుంచి కొడాలి నాని ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

అన్నగారు ఎన్.టి.ఆర్ ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం స్థాపిస్తే ఈరోజు ఆ పార్టీని బూతుల పోటీల వేదికగా మార్చిన ఘనత పచ్చమీడియాదే. 

వైకాపా నుంచి కొడాలి నాని ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద నోరు పారేసుకున్నాడు. అది చూసిన వాళ్లు రాష్ట్ర జనాభాలో 1% కూడా ఉండుండరు. కానీ దానినే పదిసార్లు రీప్లే వేసుకుని చూసిన మహా టీవీ వంశీకి మనసు రగిలిపోయింది. 

“తెలుగుదేశం నాయకులంతా చచ్చిపోయారు. సైనైడ్ తాగి చచ్చిపోయారు. చచ్చిపోయారు అజిత గారు, చచ్చిపోయారు” అంటూ సినిమాటిక్ కా రియాక్ట్ అయ్యాడు తన ఛానల్లో యాంకర్ ముందు. 

అంతటితోటి ఆగకుండా మొత్తం తెదేపా శ్రేణుల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసాడు. మీడియా ప్రతినిధిగా కాకుండా తెదేపా స్పోక్స్ పర్సన్ గా వ్యవహరించాడు. ఈయన ఆవేశపరుడే తప్ప ఆలోచనాశూన్యుడని అర్థమవుతోంది. 

మీడియా ప్రతినిధిగా తన కర్తవ్యం శాంతిభద్రతలు విచ్ఛిన్నం కాకుండా, ప్రజల్లో ఆగ్రహావేశాలు కలగకుండా చూడడం. పోనీ అంతటి ఆదర్శం ఈ రోజుల్లో అవసరం లేదనుకుందాం. కనీసం తన తెదేపా పక్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని హైలైట్ చేయకుండా డైవర్ట్ చెయ్యగలిగుండాలి. అంతే తప్ప కెలికి కన్నాన్ని పెద్దది చేసి రాష్ట్రంలో ఉన్న మిగిలిన 99% మందికి నాని అన్నది తెలిసేలాగ, ఆ అభియోగంలో నిజానిజాలు చర్చించుకునేలాగ ప్రేరేపించాడు.

నాని అన్నది ముమ్మాటికీ అబద్ధమే. కానీ అందరూ ఆ సత్యాన్ని గ్రహించరు. ఆ అభియోగంలో నిజముందని నమ్మడంలో ఆనందాన్ని పొందే చీప్ మెంటాలిటీలుంటారు. ఊహల్లోనే కథలల్లుకుంటారు. దానినే భవిష్యత్తులో చరిత్ర చేస్తారు. 

ఇంతకంటే తెదేపాకి చేసే ద్రోహం ఇంకొకటి ఉంటుందా? ఎవడో ఏదో వాగాడని ఊరంతా చాటింపేసి చెప్పడం ఎంత అవివేకం? ఇదంతా తెలిసి చేసిందని కాదు. స్వామిభక్తితో కళ్లు మూసుకుపోయిన అమాకత్వమంతే.  

వైకాపాలో ఒక్క నానికే బూతుమంత్రిగా పేరు కట్టబెడితే, ఈ రోజు తెదేపాలో మొత్తం స్త్రీలు, పురుషులు అందరూ బూతుచక్రవర్తుల్లాగానే విశ్వరూపం చూపించారు తెలుగు ప్రజలకి. 

తెలుగుదేశం నాయకులు, నాయకురాళ్లు, ఇతర తెలుగుదేశం తమ్ముళ్లు, తెలుగుదేశం మహిళలు “కొడకా…” అనే సంబోధన లేకుండా మాట్లాడలేదు. 

ఆఖరికి సాత్వికుడు అనిపించుకున్న కొల్లి రవీంద్ర కూడా ఈ బూతుల పోటీలో పాల్గొన్నాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే తనకి కోపమొచ్చి కొడాలి నానిని తిడుతున్నట్టు లేదు. నవ్వుతూ బూతులు మాట్లాడడం, పక్కనున్న జనం చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తే మరింత నవ్వి మరో నాలుగు తేలికపాటి బూతులు తిట్టడంతో ఇతను కూడా బూతు నాయకుడిగా ముద్రవేసుకున్నాడు. 

తేలికపాటి బూతులతో పాటు బరువైన అబద్ధాన్ని కూడా వదిలాడు ఈ మాజీమంత్రి. హైదరాబాదులో రింగు రోడ్డు కోసం చంద్రబాబు 5000 ఎకరాలు సేకరిస్తే వై.ఎస్.ఆర్ సీబీయై ఎంక్వైరీ వేయించాడట. ఏమన్నా అర్థముందా! వై.ఎస్. ఆర్ రింగురోడ్డు కోసం భూమి సేకరిస్తుంటే అందులో మురళీమోహన్ లాంటి వాళ్ల భూములు పోతున్నాయని చంద్రబాబు వర్గం కదా లబోదిబోమన్నది. రింగురోడ్డు విషయంలో అభివృద్ధికి అడ్డుపడింది తెదేపా అన్నది నగ్నసత్యం. ఇప్పుడేంటో ఈ చిరుబూతుల మంత్రి కొల్లి రవీంద్ర స్టీరింగ్ ఇటు తిప్పుతున్నాడు. కామెడీ మీద కామెడీ అంటే ఇదే. 

ఒక వీడియోలో ఒక మహిళ నానిని బూతులు తిడుతూ మధ్యలో “తన అత్తని ఇంతలేసి మాటలు అంటుంటే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు నోరు తెరవట్లేదు” అని ఆవేశంతో ఊగిపోతుంటే పక్కనున్న మరొక మహిళ “ఉష్..ఉష్” అంటూ ఆపే ప్రయత్నం చేసింది. ఎందుకంటే మళ్లీ జూనియర్ ని టాపిక్కులోకి తీసుకొస్తే విషయం డైల్యూట్ అయిపోతుందని. అందరూ ఇలా ప్లానేసుకుని, ప్రిపేరయ్యి, బూతుల్ని సంచిలో వేసుకొచ్చి దులిపేసిన వాళ్లే తప్ప ఒక్కరి ఆవేశంలో కూడా నిజమైన ఆవేదన, చంద్రబాబు కుటుంబం మీద అభిమానం కనపడలేదు. 

మొత్తమ్మీద తెలుగు ప్రజలకి ఈ రోజు తెదేపా అంటేనే బూతులపార్టీ అని అనిపిస్తోంది. రాజకీయ వార్తలు పట్టించుకోని వాడికి కూడా కొడాలి నాని చంద్రబాబు భార్యపై ఫలానా అభియోగం చేసాడని తెలిసిపోయింది. ఇంతకంటే దరిద్రం మరొకటి లేదు.

తెదేపాకి ప్రపంచంలోనే లోతైన గొయ్యి తవ్వి సమాధి చేస్తున్నది అనుకూల మీడియానే అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉండదు. ఈ బూతుల పోటీవల్ల తెదేపాకి ప్లస్సేమీ లేదు. ప్రజల దృష్టిలో మైనస్సవ్వడం తప్ప. 

– హరగోపాల్ సూరపనేని