జగన్ ఘనతకు నిదర్శనం ఇదే

వైద్య రంగంలో వైసీపీ ప్రభుత్వం సాధించిన ఘనతకు ఇదే ఉదాహరణ అని అంటున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాసుపత్రులకు నేషనల్‌ అక్రిడియేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్ కేర్‌ ప్రొవైడర్‌ క్రిడేషన్ మంజూరు చేసింది. అలా…

వైద్య రంగంలో వైసీపీ ప్రభుత్వం సాధించిన ఘనతకు ఇదే ఉదాహరణ అని అంటున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాసుపత్రులకు నేషనల్‌ అక్రిడియేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్ కేర్‌ ప్రొవైడర్‌ క్రిడేషన్ మంజూరు చేసింది. అలా విశాఖలో రెండు ప్రభుత్వాసుపత్రులకు అక్రిడేషన్ దక్కింది. గవర్నమెంట్‌ మెంటల్‌ కేర్‌, గవర్నమెంట్‌ చెస్ట్‌ డిసీజెస్‌ ఆస్పత్రులు అత్యుత్తమ పనితీరు కనపరుస్తున్నాయని ఈ అక్రిడేషన్ ఇచ్చారు.

క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలోని ఒక విభాగమే నేషనల్‌ అక్రిడియేషన్‌ బోర్డ్‌. ఇది దేశంలోని ఆసుపత్రులు, హెల్త్ కేర్ సెంటర్స్, రక్తదాన కేంద్రాలు, ఆయుష్ ఆసుపత్రులు, వివిధ స్థాయిల్లో పనిచేసే హెల్త్ కేర్ యూనిట్లకు నాణ్యతా ప్రమాణాలను బట్టి గుర్తింపు ఇవ్వడానికి ఏర్పాటు చేయబడింది.

సుమారు 10 చాప్టర్లు, 100 ప్రమాణాలు కలిగిన ఈ విభాగం 503 లక్ష్యాలతో  పనిచేస్తుంది.  ఆసుపత్రులు ఈ అక్రిడేషన్ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకుంటాయి. ఈ అక్రిడియేషన్‌ కాలపరిమితి మూడేళ్లు ఉంటుంది. నేషనల్‌ అక్రిడియేషన్‌ బోర్డ్‌ ధృవీకరణ పొందాలంటే ఆసుపత్రులు ముఖ్యంగా ఎనిమిది విభాగాల్లో నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండాలి. ఈ ప్రమాణాలన్నింటినీకూడా విశాఖపట్నంలోని రెండు ఆస్పత్రులు అందుకున్నాయి.

సర్వీస్‌ ప్రొవిజన్‌, రోగుల హక్కులు, ఇన్‌పుట్స్, సహాయక సేవలు, క్లినికల్‌ కేర్‌, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, నాణ్యమైన ఆరోగ్య సేవల నిర్వహణ  రోగి భద్రత. ఈ విభాగాల్లో సంపూర్ణమైన ప్రమాణాలు పాటిస్తున్నాయి. వీటిని పరిశీలించిన బోర్డు రెండు ఆస్పత్రులకు అక్రిడేషన్‌ మంజూరు చేసింది.

ఒక విధంగా చూస్తే వైసీపీ ప్రభుత్వం వైద్య రంగానికి ఏపీలో ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యత ఫలితంగానే ఈ అక్రిడేషన్ దక్కింది అని అంటున్నారు. ముందు ముందు మరిన్ని  ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ ఘనత దక్కాలని అంతా కోరుకుంటున్నారు. ఏపీలో ఏమీ అభివృద్ధి  జరగడంలేదు అంటున్న విపక్షాలకు ఇది ఒక సమాధానం అని కూడా అంటున్నారు.