సీఎం జగన్ ఎప్పుడు మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఎల్లో మీడియాను, జనసేన పవన్ కళ్యాణ్‌ను విమర్శించడం మామూలే అందులోను పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తకుండా ఆయనపై పంచులు వేయడం మామూలుగా జరిగేది. కాకపోతే పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మఒడి నిధుల విడుదల కార్యక్రమంలో మాత్రం పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా ఈసారి కాస్త ఘాటుగానే ఆయనపై సెటైర్లు వేశారు.
సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు కోసం ఓ దత్తపుత్రుడు లారీ ఎక్కి ఊగిపోతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయనలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం.. బూతులూ తిట్టలేం.. వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని, నాలుగేళ్లకోసారి భార్యనూ మార్చలేం.. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డుమీదికి తీసుకురాలేం అంటూ అవన్నీ పవన్‌కు మాత్రం సాధ్యం అంటూ సెటైర్లు వేశారు.
గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న జనసేన.. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ఒక్కసారి కూడా విమర్శించలేదన్నారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబును సీఎం చేయడం కోసం బూతులు తిడుతూన్నరంటూ మండిపడ్డారు. టీడీపీ అంటేనే టీ అంటే తినుకో.. డీ అంటే దోచుకో.. పీ అంటే పంచుకో అంటూ దోచుకున్న అవినీతి సొమ్మును ఆ నలుగురు పంచుకున్నరంటూ మండి పడ్డారు.
మొత్తానికి చాలా రోజుల తర్వాత సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చారు. కాగా ఇంతకు ముందే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై మాట్లాడుతూ కావాలంటే మీరు చేసుకోండి అంటూనే ఎలా చేసుకోవాలనే సలహాలు కూడా ఇచ్చిన విషయం తెలిసింది.