అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. జనసేనాని పవన్‌కల్యాణ్ పేరు ఎత్తకుండానే ఓ రేంజ్లో జగన్ ర్యాగింగ్ చేశారు. పవన్‌కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై జగన్ విరుచుకుపడ్డారు. ఇటీవల మంగళగిరిలో జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌కల్యాణ్ అధికార పార్టీపై రెచ్చిపోయారు.
పదేపదే తన మూడు పెళ్లిళ్లపై వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భరణంతో పాటు విడాకులు ఇచ్చిన తర్వాత మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని, మీరు చేసుకోండ్రా అని వైసీపీ నేతలపై పవన్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పవన్‌కు జగన్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
“మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని చెబితే…మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారు. రాజకీయ నాయకులు ఇచ్చే సందేశం ఇదేనా? నాలుగైదేళ్లు కాపురం చేసి, ఎంతో కొంత ఇచ్చి విడాకులు తీసుకుని.. పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెడితే వ్యవస్థ ఏం అవుతుంది. ఆడవాళ్ల మాన ప్రాణాలు ఏం కావాలి.? ఒక్కసారి ఆలోచన చేయండి” అని జగన్ జనానికి అప్పీల్ చేశారు.
పవన్‌కల్యాణ్ ఏ విషయానికైతే ఇరిటేట్ అవుతున్నారో, దాన్నే ప్రత్యర్థులు పదేపదే ప్రస్తావిస్తుండడాన్ని గమనించొచ్చు. మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకునే వాళ్ల పట్ల సమాజంలో చిన్న చూపు వుంది. పవన్ చెబుతున్నట్టు భారీ మొత్తంలో భరణం చెల్లించి, విడాకులు తీసుకున్న తర్వాతే తాను పెళ్లి చేసుకున్నప్పటికీ, నైతికంగా అది సరైంది కాదనేది లోకాభిప్రాయం. అందుకే పవన్‌ను రాజకీయంగా బద్నాం చేయడానికి ఆయన మూడుపెళ్లిళ్ల అంశాన్ని వైసీపీ గెలుకుతోంది. దీన్ని పవన్ దీటుగా ఎదుర్కోవాల్సిందే తప్ప, తిడుతానంటే కుదరదు.