పవన్ కళ్యాణ్, తన అత్యంత సన్నిహితుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తన దైన శైలిలో ఎక్కడ పేర్లు ఎత్తకుండా గట్టి కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదు కాని మూడు పెళ్లిళ్ల వల్ల మేలు జరుగుతుందా అంటూ జగన్ పవన్ ను ఉద్దేశిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
అవనిగడ్డ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రజలకు ఏం చేయలేని వారు బూతులు తిడుతు.. చెప్పులు చూపిస్తునరంటూ మండిపడ్డారు. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తున్నారో అంతా చూస్తున్నారని వారి పేర్లు ఎక్కడ ఎత్తకుండా వారిపై విరుచుకుపడ్డారు. మనం ఎవరికీ అన్యాయం చేయకుండా.. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూస్తున్నాం. కానీ మూడు రాజధానులు వద్దని.. మూడు పెళ్ళిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారంటూ మండిపడ్డారు.
మీరూ పెళ్లిళ్లు చేసుకోండి అని టీవీల్లో దత్తపుత్రుడు చెప్పుతుంటే.. మాన ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి వారు ప్రజలకు దశ, దిశ చూపగలరా? అంటూ మండిపడ్డారు. 19 నెలల్లో పచ్చ బ్యాచ్ అందరూ ఏకమవుతారని వారిపై మానం పోరాటం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.
మొత్తానికి జగన్ మాటలని బట్టి ఇకపై వైసీపీ ఒకవైపు, టీడీపీ-జనసేన ఒక వైపు ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నట్లు కనిపిస్తోంది. ఎక్కడ చంద్రబాబు, పవన్ పేర్లు ఎత్తకుండా వారిని విమర్శించడం విశేషం. జగన్ మాటలపై చంద్రబాబు సన్నిహితుడు పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.