ఫీజు పోరులో పాల్గొన‌ని ఇన్‌చార్జ్‌ల‌పై జ‌గ‌న్ సీరియ‌స్‌!

రాష్ట్ర వ్యాప్తంగా యువ‌త పోరు ఎలా జ‌రిగింది? ఎవ‌రెవ‌రు పాల్గొన్నారు? త‌దిత‌ర అంశాల‌పై జ‌గ‌న్ నివేదిక తెప్పించుకున్నారు.

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, వ‌స‌తి దీవెన చెల్లించ‌కుండా విద్యార్థుల‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ ఇబ్బంది పెట్ట‌డాన్ని నిర‌సిస్తూ వైసీపీ నేతృత్వంలో యువ‌త పోరు చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 12న నిర్వ‌హించారు. అయితే యువ‌త పోరును సీరియ‌స్‌గా తీసుకోకుండా, కొంద‌రు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు మ‌రెవ‌రికో బాధ్య‌త‌లు అప్ప‌గించారు. కొంద‌రు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు యువ‌త పోరులో పాల్గొన‌కుండా, కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించి విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లిన‌ట్టు జ‌గ‌న్‌కు స‌మాచారం అందింది.

రాష్ట్ర వ్యాప్తంగా యువ‌త పోరు ఎలా జ‌రిగింది? ఎవ‌రెవ‌రు పాల్గొన్నారు? త‌దిత‌ర అంశాల‌పై జ‌గ‌న్ నివేదిక తెప్పించుకున్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్‌చార్జ్‌లు పాల్గొన‌లేద‌ని జ‌గ‌న్‌కు స‌మాచారం అందింది. దీంతో ఆయ‌న సీరియ‌స్ అయ్యిన‌ట్టు తెలిసింది. చాలా కాలం నుంచి ఈ కార్య‌క్ర‌మం విష‌య‌మై చెబుతున్నామ‌ని, అయినా సీరియ‌స్‌గా తీసుకోక‌పోవ‌డం ఏంట‌ని మండిప‌డ్డ‌ట్టు తెలుస్తోంది.

అలాంటి వాళ్ల‌కు భ‌విష్య‌త్‌లో టికెట్ ఇచ్చే విష‌య‌మై ఆలోచ‌న చేయాల్సి వుంటుంద‌ని జ‌గ‌న్ హెచ్చ‌రించిన‌ట్టు స‌మాచారం. యువ‌త పోరులో పాల్గొన‌ని నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు ప‌క్క పార్టీల వైపు చూస్తున్నారా? లేక వాళ్ల మ‌న‌సులో మ‌రేదైనా వుందా? అని అధిష్టానం పెద్ద‌లు ఆరా తీస్తున్నార‌ని తెలిసింది. కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగానే కార్య‌క్ర‌మంలో పాల్గొన‌లేద‌ని జ‌గ‌న్‌కు నివేదిక అందిన‌ట్టు స‌మాచారం.

14 Replies to “ఫీజు పోరులో పాల్గొన‌ని ఇన్‌చార్జ్‌ల‌పై జ‌గ‌న్ సీరియ‌స్‌!”

  1. యువత పోరు అన్నారు కదా …తమ వయసు అరహతలేదని అనుకొని ఉంటారు…అసలే అన్న లెక్కలో 55-60 వయసువాళ్లంతా వేస్ట్ కదా

  2. “ఫీజు పోరులో పాల్గొన‌ని ఇన్‌చార్జ్‌ల‌పై జ‌గ‌న్ సీరియ‌స్‌!”…did he scolded himself seriously?..lol

  3. ఈయన గారు బాగానే చెబుతారు వాసిపోయేది వాళ్ళకే ఎందుకంటే ఈ పోరాటం చేసే వాళ్ళను అరెస్ట్ చేసి ఏదొక విద్యాసంస్థ దగ్గరకు తీసుకెళ్లి ఈ జగన్ గారు పెట్టిన బకాయిని విద్యార్థులకు చూపి వీళ్ళు చేసే పోరుకు అర్ధముందా అని ప్రశ్నిస్తే వీళ్ళ ఆన్సర్ నోరు వెళ్ళబెట్టడమే ఆ తర్వాత విద్యార్థులు వీళ్ళను ఉతికి ఆరేస్తారు ఇలాంటి వి అయన తెలివి గ బయటకు రాకుండా బకరా గాళ్ళను పంపి వాళ్లకు దెబ్బలు తగిలితే రాజకీయం చేయటానికి తప్ప జనం లో విలువ లేనివి

Comments are closed.