మ‌హారాష్ట్ర ఫ‌లితాల‌పై జ‌గ‌న్ గ‌ప్‌చుప్‌

మ‌హారాష్ట్ర ఫ‌లితాల‌పై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్పందించ‌లేదు. అక్టోబ‌ర్‌లో హ‌ర్యానా ఫ‌లితాలు వెల్ల‌డైన‌ప్పుడు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించిన సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 9న జ‌గ‌న్ చేసిన ట్వీట్ ఏంటో…

మ‌హారాష్ట్ర ఫ‌లితాల‌పై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్పందించ‌లేదు. అక్టోబ‌ర్‌లో హ‌ర్యానా ఫ‌లితాలు వెల్ల‌డైన‌ప్పుడు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించిన సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 9న జ‌గ‌న్ చేసిన ట్వీట్ ఏంటో గుర్తు చేసుకుందాం.

“ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు వ్య‌తిరేకంగా ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాదిరిగానే హ‌ర్యానాలో కూడా అసెంబ్లీ ఫ‌లితాలు ప్ర‌జాభిప్రాయాన్ని గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నాయి. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల్లో విశ్వాసం నింపేందుకు చ‌ట్ట‌స‌భ స‌భ్యులు ముందుకు రావాలి. ఏపీలో ఇప్ప‌టికే ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కోర్టుల్లో కేసులు న‌డుస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికీ బ్యాలెట్‌ల‌నే వాడుతున్నారు. అమెరికా, యూకే, కెన‌డా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, స్విట్జ‌ర్లాండ్‌, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, జపాన్‌, నార్వే, డెన్మార్క్ స‌హా చాలా అభివృద్ధి చెందిన‌ దేశాల్లో ఇప్ప‌టికీ పేప‌ర్ బ్యాలెట్‌ను వాడుతున్నారు. మ‌నం కూడా బ్యాలెట్ల‌కే వెళ్ల‌డం మంచిది”

ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో కూడా అనూహ్య ఫ‌లితాలు వ‌చ్చాయి. ఇండియా కూట‌మి తుడిచి పెట్టుకుపోయింది. ఈవీఎంల‌లో గోల్‌మాల్ జ‌రిగింద‌ని ఆ రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. అధికార కూట‌మిపై ఎంతోకొంత వ్య‌తిరేక‌త వుంటుంద‌ని, అలాంటిది అప‌రిమిత‌మైన అధికారం ద‌క్క‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. మ‌రోసారి బ్యాలెట్ అంశం తెర‌పైకి వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ మాత్రం ఈ ద‌ఫా వ్యూహాత్మ‌కంగా స్పందించ‌లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

13 Replies to “మ‌హారాష్ట్ర ఫ‌లితాల‌పై జ‌గ‌న్ గ‌ప్‌చుప్‌”

  1. ఈ‌ EVM అనే దరిద్రాన్ని ఎంత‌ త్వరగా వదిలించుకుంటే ప్రజాస్వామ్యానికి అంత మంచిది. ఇప్పుడు సమర్థిస్తున్న బీజేపీ తో సహా దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో వ్యతిరేకించిన వాళ్లే, తమకు అనుకూలంగా ఫలితాలు వచ్చినప్పుడు సమర్థిస్తున్నారు. జగన్ తనకు సంపూర్ణ మెజారిటీతో, 22 మంది ఎంపీలతో అధికారం లో ఉన్నప్పుడు ఈ డిమాండ్ వినిపించి ఉంటే ఉపయోగం ఉండేది‌.

  2. మీ అన్నకు నాలుగు మంచి మాటలు రాసినా మోడరేట్ చేస్తున్నారు, అందుకేనేమో‌ మీరు ఆయనకు ఎన్ని‌ మంచి‌ మాటలు చెప్పలని ఆర్టికల్స్ రాస్తున్నా వాటిని ఆయన మోడరేట్ చేసుకుంటున్నట్లున్నాడు‌.

  3. ఇప్పుడేంటి..అన్నని జాతినుద్దేశించి ప్రసంగించమంటావా ఎంది బుల్రెడ్డి..

Comments are closed.