జ‌గ‌న్ స‌క్సెస్ మంత్రం అదట‌!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ప్ర‌శంసించ‌డంలోనూ, ప్ర‌త్య‌ర్థుల‌ను విమ‌ర్శించ‌డంలోనూ మంత్రి రోజా ముందు వ‌రుస‌లో వుంటారు. జ‌గ‌న్‌పై ఆమె ఈగ వాల‌నివ్వ‌రు. న‌గ‌రిలో ఆమె టికెట్‌పై ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అయితే కొత్త అభ్య‌ర్థుల‌ను తీసుకొచ్చే…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ప్ర‌శంసించ‌డంలోనూ, ప్ర‌త్య‌ర్థుల‌ను విమ‌ర్శించ‌డంలోనూ మంత్రి రోజా ముందు వ‌రుస‌లో వుంటారు. జ‌గ‌న్‌పై ఆమె ఈగ వాల‌నివ్వ‌రు. న‌గ‌రిలో ఆమె టికెట్‌పై ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అయితే కొత్త అభ్య‌ర్థుల‌ను తీసుకొచ్చే నియోజ‌క‌వ‌ర్గాల‌నే ఇప్పుడు ప్ర‌క‌టిస్తున్నార‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఒక‌వేళ టికెట్ ఇవ్వ‌ని ప‌క్షంలో జ‌గ‌న్ ముందే చెబుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ లెక్క‌న మంత్రి రోజాకు టికెట్‌పై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్‌పై ఆమె ప్ర‌శంస‌లు విన్న‌వాళ్లు, టికెట్ కోస‌మే అని వెట‌క‌రించేవాళ్లు లేక‌పోలేదు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విజయవాడలో శుక్రవారం జాతీయ యువజనోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జ‌గ‌న్ సూప‌ర్ స‌క్సెస్‌కు కార‌ణం చెప్పారు.  

సీఎం జ‌గ‌న్ త‌క్కువ మాట్లాడి, ఎక్కువ ప‌ని చేయ‌డ‌మే ఆయ‌న రాజ‌కీయాల్లో సూప‌ర్ స‌క్సెస్ కావ‌డానికి మంత్రంగా ప‌నికొచ్చింద‌న్నారు. క‌డివెడు క‌బుర్ల క‌న్నా, గ‌రిటెడు ఆచ‌ర‌ణ మిన్న అనే స్వామి వివేకానంద స్ఫూర్తిని తీసుకుని జ‌గ‌న్ ముందుకెళుతున్నార‌ని ఆమె చెప్పుకొచ్చారు. జ‌గ‌న్‌ యూత్ ఐకాన్ అని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

జగన్‌ను యువ‌త ఆద‌ర్శంగా తీసుకుని జీవితంలో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని పిలుపునిచ్చారు.