జ‌న‌సేన ఇన్‌చార్జ్ బాధితురాలికి బెయిల్

తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ బాధితురాలు ల‌క్ష్మికి జైపూర్ సీజేఎం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ బాధితురాలు ల‌క్ష్మికి జైపూర్ సీజేఎం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చెక్‌బౌన్స్ కేసులో రెండు రోజుల క్రితం తిరుప‌తి ప్రెస్‌క్ల‌బ్ వ‌ద్ద ఆమెను రాజ‌స్థాన్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రూ.50 వేలు చొప్పున రెండు పూచీక‌త్తులు స‌మ‌ర్పించాల‌ని ఆదేశిస్తూ ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేయ‌డం విశేషం.

ల‌క్ష్మి అరెస్ట్‌కు ముందే, ఈ విష‌యాన్ని జ‌న‌సేన నాయ‌కుడు మీడియాకు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఆమె కిలేడీ అని, దేశాన్ని కొల్ల‌గొట్టిన‌ట్టు …మోస‌గించిన వ్య‌క్తే ఆరోపించ‌డం, దాన్నే ఒక వ‌ర్గం మీడియా హైలైట్ చేయ‌డం తెలిసిందే. ఒకే ఒక్క రోజు జైల్లో గ‌డిపిన ల‌క్ష్మికి న్యాయ స్థానంలో ఊర‌ట ద‌క్కింది. ఈ సంబ‌డానికి ఆమె ఏళ్ల త‌ర‌బ‌డి త‌ప్పించుకుని తిరుగుతున్నట్టు ప్ర‌చారం చేశారు. అయితే కేసులో ఏమీ లేద‌ని బెయిల్ మంజూరుతో వెల్ల‌డైంది.

కానీ త‌న‌ను అన్ని ర‌కాలుగా మోస‌గించాడ‌ని, న్యాయం చేయాల‌ని మీడియా ముందుకొచ్చి ఓ మ‌హిళ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను వేడుకున్నా ప్ర‌యోజ‌నం క‌రువైంది. అలాగే పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా, క‌నీస స్పంద‌న కూడా లేదు. అధికారంలో వుంటే, ఎలాంటి నేరాలు చేసినా ఏమీ కాద‌ని బాధితురాలి ఎపిసోడ్‌లో రుజువైంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. జైలు నుంచి బాధితురాలు బ‌య‌టికొచ్చిన త‌ర్వాత‌, జ‌న‌సేన నాయ‌కుడిపై మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డిస్తారనే చ‌ర్చ జ‌రుగుతోంది.

10 Replies to “జ‌న‌సేన ఇన్‌చార్జ్ బాధితురాలికి బెయిల్”

  1. వారిని అధికారం లో ఉంటే ఏ కేసు ఏమి చెయ్యలేదు అని ఇప్పుడు ప్రూఫ్ కావడమేంటిరా ఎర్రిపప్ప?సేవాలు ఇంటికి డెలివరీ చేసిన కేసు తొక్కబడింది…మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకు ఆయుధాలతో వెళ్తే కేసు తొక్కబడింది. పోలీస్ Commisionerate లో కూతవేటు దూరం లో మారణాయుధాలతో మంద ఎగబడితే కేసు తొక్కబడింది. అధికారం ఉన్నాం అని నెపం తో సాక్షం చెప్పకుండా ఒక దళిత యువకుడిని అయిదు ఏళ్ళు జైలు లో ఉంచిన కేసు తొక్కబడింది.

Comments are closed.