ఎన్టీఆర్ వాయిస్ తీసేస్తే..?

“రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం..” అనే అరివీర ఎలివేషన్ తో విజయ్ దేవరకొండను ప్రజెంట్ చేయడం బాగుంది.

విజయ్ దేవరకొండ కొత్త సినిమా హంగామా మొదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అతడు చేస్తున్న సినిమాకు కింగ్ డమ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు అఫీషియల్ టీజర్ లాంచ్ చేశారు. తెలుగులో ఈ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అదే విధంగా హిందీలో రణబీర్ కపూర్, తమిళ్ లో సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారు.

తెలుగు వరకు వస్తే.. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ వాయిస్ వినిపించకపోతే ఈ టీజర్ ఈపాటికి తేలిపోయి ఉండేది. ఎందుకంటే, ఇందులో కనిపిస్తున్న విజువల్స్ ఇంతకుముందు దేవర, సలార్, కేజీఎఫ్ లాంటి సినిమాల్లో చూసినవే.

ఇక ఇందులో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అనిరుధ్ ఇప్పటికే కొన్ని సినిమాల్లో చూచాయగా వినిపించాడు. సో.. ఉన్నంతలో కొత్తగా అనిపించింది ఎన్టీఆర్ వాయిస్.

ఇక విజయ్ దేవరకొండ చిన్న హెయిర్ తో డిఫరెంట్ గా కనిపించాడు. అతడు చెప్పిన “మొత్తం తగలబెట్టేస్తా” అనే డైలాగ్ లో అంత డెప్త్ కనిపించనప్పటికీ బాగుంది. “రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం..” అనే అరివీర ఎలివేషన్ తో విజయ్ దేవరకొండను ప్రజెంట్ చేయడం బాగుంది. ఓవరాల్ గా టీజర్ లో ఎమోషనల్ వయొలెన్స్ కనిపించింది.

ఈ సినిమాను స్పై థ్రిల్లర్ గా గతంలో చెప్పుకొచ్చారు. టీజర్ లో దానికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏవీ కనిపించలేదు. ట్రయిలర్ రిలీజైన తర్వాత మరింత స్పష్టత వస్తుంది. మే 30న కింగ్ డమ్ సినిమాను రిలీజ్ చేస్తారు.

12 Replies to “ఎన్టీఆర్ వాయిస్ తీసేస్తే..?”

  1. ఇతని యాక్షన్ ఒకే కానీ డైలాగ్స్ లో ఒత్తులు ఉండవు. కొన్ని పదాలు నోటికి తిరగవు.

Comments are closed.