చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీపై సోషల్ మీడియాలో సెటైర్స్ దీపావళి టపాసుల్లా పేలుతున్నాయి. పవన్‌కల్యాణ్ స్థిరత్వం లేని రాజకీయాలు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
బాబుతో భేటీపై ప్రధానంగా పవన్‌ను ప్రతి ఒక్కరూ టార్గెట్ చేస్తుండడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వుంటుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని వ్యంగ్యంతో కూడిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. టీడీపీతో పొత్తు కుదిరితే జనసేన ఒరిజినల్‌గా పోటీ చేసే స్థానాలంటూ… నెటిజన్లు లెక్కలు చెప్పడం ఆకట్టుకుంటోంది.
పవన్‌తో పాటు ఆ పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ మాత్రమే జనసేన తరపున ఒరిజినల్‌గా పోటీ చేస్తారని నెటిజన్లు తేల్చి చెబుతున్నారు. జనసేనాని ఏకైక లక్ష్యం జగన్‌ను గద్దె దింపడం కంటే… తాను ఎమ్మెల్యే కావడమే అని చెబుతున్నారు.
తనతో పాటు నాదెండ్లకు గెలుపు భరోసానిచ్చే సీట్లు ఇస్తే పవన్ పొత్తుకు సిద్ధమని పంచ్‌లు విసరడం విశేషం. ఎందుకంటే టీడీపీ మద్దతు లేకపోతే ఎప్పటికీ తాను అసెంబ్లీలో అడుగు పెట్టనని పవన్‌కల్యాణ్‌కు బాగా తెలుసనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేగా రెండోసారి కూడా ఓడిపోతాననే భయమే చంద్రబాబుకు సాగిలపడేంతగా పవన్‌ను దిగజార్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా సంఖ్య కోసం 10, 15 సీట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పినా, వాటిల్లో అభ్యర్థులను టీడీపీ అధినేతే ప్రకటిస్తారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
పవన్ ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు .. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నా , లోకేశ్ ఉన్నా ఆయనకి ఎలాంటి అభ్యంతరం వుండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.