ఒకవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా 24 సీట్లకు పరిమితం కావడంపై జనసైనికులు విస్తుపోతున్నారు! పార్టీపెట్టిన పదేళ్ల తర్వాత 24 సీట్లలో పోటీ చేస్తే.. పవన్ ఎప్పటికీ సీఎం అవుతాడనేది జనసైనికులకే అంతుబట్టని అంశంగా మారింది!
ఆ 24 నియోజకవర్గాలనూ చంద్రబాబు నాయుడు తన దయ చేతనో, వ్యూహం మేరకో కేటాయించినా… కనీసం అక్కడ అభ్యర్థులను ప్రకటించుకునే పరిస్థితి కూడా ఇప్పటి వరకూ లేదు! దానికి మళ్లీ తెలుగుదేశం నుంచినే నేతలను చేర్చోవాలి! అంతా చంద్రబాబు స్కెచ్ మేరకే జరగాలి!
పవన్ మాట్లాడే అహంభావపు రాజకీయ మాటలకూ.. జనసేన పరిస్థితికీ నక్కకూ నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది! ఈ పరిస్థితి జననైనికుల్లో నిస్తేజాన్ని కలిగించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు! సరిగ్గా ఇదే సమయంలో సోషల్ మీడియాలో పవన్ భూములమ్ముకున్నాడు, ఆస్తులు అమ్ముకున్నాడు అనే ప్రచారం మొదలుకావడం గమనార్హం! తాడూబొంగరం లేని ఈ ప్రచారం ద్వారా.. అభిమానవర్గాల నుంచినో లేదా కాపుల నుంచినో సానుభూతి పొందే ప్రయత్నం ఉండవచ్చు!
రాత్రికి రాత్రి జనసేన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆ అమ్మకపు వార్తలను వైరల్ చేయించడం గమనార్హం. జనసేన వీరాభిమానులు పవన్ ఆస్తులను అమ్ముకున్నాడు ఎన్నికల ఖర్చుకోసం అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు! పవన్ ఆస్తులమ్ముకున్నాడు కాబట్టి.. చంద్రబాబు వ్యూహాల మేరకు జనసేన ఏం చేసినా పార్టీకి సపోర్ట్ చేయాలనే హిడెన్ మెసేజ్ ను గట్టిగానే ఇచ్చుకుంటున్నారు!
పవన్ కల్యాణ్ ఇన్ కమ్ ట్యాక్స్ కట్టడానికి ఐదు కోట్లు అప్పు చేశాడంటూ గతంలో ఒక జనసేన సానుభూతి పరుడు చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారాయి! ఇన్ కమ్ ట్యాక్స్ కట్టడం కోసం ఐదు కోట్లు అప్పట ఇదీ జనసేన పరిస్థితి. పవన్ ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడని పదేళ్ల కిందట గట్టి ప్రచారమే చేశారు! మరి ఇప్పుడు ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ద్వారా ఆస్తుల అమ్మకం ప్రచారం జరుగుతుండటం గమనార్హం. మరి దీంతో జనసేనపై సానుభూతి వర్షిస్తుంది కాబోలు!